భారతీయుడికి 17 కోట్ల లాటరీ

భారతీయుడికి 17 కోట్ల లాటరీ

06-02-2018

భారతీయుడికి 17 కోట్ల లాటరీ

అబుదాబీలో ఓ భారతీయుడిని అదృష్టం వరించింది. అతనికి రూ.17 కోట్ల లాటరీ తగిలింది. కేరళకు చెందిన సునీల్‌ కుట్టి నాయర్‌ అబుదాబీలో నివసిస్తున్నాడు. ఇటీవల అతను 500 ధిరమ్‌లు చెల్లించి ఓ లాటరీ టికెట్‌ కొనుగోలు చేశాడు. లాటరీ టికెట్‌ డ్రాలో సునీల్‌ మొదటి బహుమతి కింద రూ.17.68 కోట్లు గెలుచుకున్నాడు. కాగా, టికెట్‌ కొనేందుకు డబ్బిచ్చిన ముగ్గురు స్నేహితులతో ఆ లాటరీ మొత్తాన్ని పంచుకోనున్నట్లు సునీల్‌ తెలిపాడు.