న్యూయార్క్ లో లోకేష్ పర్యటన
Nela Ticket
Chal Mohan Ranga
Kizen
APEDB

న్యూయార్క్ లో లోకేష్ పర్యటన

06-02-2018

న్యూయార్క్ లో లోకేష్ పర్యటన

అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్క్‌లో రాష్ట్ర ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌ పర్యటించారు. ఈ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో టెక్నాలజీ పెద్దఎత్తున వినియోగిస్తున్నామని, రియల్‌టైం గవర్నెన్స్‌ ద్వారా అనేక సేవలందిస్తున్నామని మంత్రి లోకేశ్‌ చెప్పారు. కెన్సస్‌  ఆయన సెర్నర్‌ ఇన్నోవేషన్‌ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో డెవల్‌పమెంట్‌ సెంటర్‌ ఏర్పాటుచేయాలని వారిని ఆహ్వానించారు. త్వరలో ఏర్పాటుచేస్తామని సెర్నర్‌ ఇన్నోవేషన్స్‌ కంపెనీ ప్రతినిధులు హామి ఇచ్చినట్లు తెలిసింది.

కార్యక్రమంలో బిల్‌గ్రాఫ్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రామా నడింపల్లి, జనరల్‌ మేనేజర్‌ ఇండియా ర్యాన్‌ హ్యామిల్టన్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ గ్రూప్‌ ప్రెసిడెంట్‌ టామ్‌ ఫార్లే, టెక్నాలజీ హెడ్‌ శ్రీ అట్లూరిని మంత్రి లోకేశ్‌ కలిశారు. పలు ఫింటెక్‌ కంపెనీల ప్రతినిధులు, ఎగ్జిక్యూటివ్‌లతో భేటీ అయ్యారు.

Click here for Event Gallery