అమెరికా బాటలోనే సౌదీ

అమెరికా బాటలోనే సౌదీ

06-02-2018

అమెరికా బాటలోనే సౌదీ

అమెరికా బాటలోనే సౌదీ అరేబియా కూడా పయనించనుందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. స్థానికులకే ఉద్యోగాలంటూ ట్రంప్‌ అనుసరించిన విధానాన్నే సౌదీ కూడా అనుసరించే ప్రయత్నం చేస్తోంది. తాజాగా తమ పౌరులకే ఉద్యోగాలు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోంది. 12 కీలక రంగాల్లో విదేశీయులు పనిచేయడానికి వీల్లేదని సౌదీ అడ్డుకట్టవేసింది. ఈ విధానానికి కార్మిక మంత్రి అలీ బిన్‌ నసీర్‌ అల్‌ ఘపీస్‌ ఆమోద తెలిపారు. దీంతో సౌదీలో దశాబ్దాలుగా సేవలందిస్తున్న 1.2 కోట్ల మంది విదేశీయులపై ప్రభావం పడనుంది. కాగా, వీరిలో అత్యధికులు తక్కువ వేతనాలతో వివిధ రంగాల్లో పనిచేసే కార్మికులే కావడం గమనార్హం. 12 రంగాల్లో విదేశీ ఉద్యోగులు పనిచేయడాన్ని కార్మిక, సామాజిక, సంక్షేమ మంత్రిత్వ శాఖ దశలవారీగా నియంత్రించనున్నట్లు పేర్కొంది. దశల వారీగా వివిధ రంగాలలో పనిచేసే కార్మికులపై నియంత్రణ అమలు చేయనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.