అమెరికాలోని ఎన్ఆర్ఐలకు మద్దతు

అమెరికాలోని ఎన్ఆర్ఐలకు మద్దతు

07-02-2018

అమెరికాలోని ఎన్ఆర్ఐలకు మద్దతు

గ్రీన్‌కార్డుల జారీపై ట్రంప్‌ ప్రభుత్వం పెట్టిన కోటాను ఎత్తివేయాలంటూ పోరాడుతున్న అమెరికాలోని భారతీయులకు, అక్కడి ప్రజాప్రతినిధుల మద్దతు లభించింది. ఒక దేశానికి ఇన్నే గ్రీన్‌కార్డులు ఇస్తాం అనే విధానం సరికాదని వారు సృష్టం చేశారు. దీనివల్ల ప్రతిభావంతులైన భారతీయుల సేవలను అమెరికా కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ లెక్కన ఓ నిపుణుడైన భారతీయుడు గ్రీన్‌కార్డును పొందటానికి గానీ, అమెరికా స్థిర నివాస హక్కుని దక్కించుకోవడానికి గానీ దాదాపు 70 ఏళ్లు  ఎదురుచూడాలని అభిప్రాయపడ్డారు. 

200 మందితో కూడిన భారతీయ నిపుణుల బృందం ఇమిగ్రేషన్‌ వాయిస్‌ పేరిట వాషింగ్టన్‌లో పలువురు ఎంపీలతో సమావేశమైంది. ఈ సందర్భంగా ఆ ఆరుగురు ఈ బృందం ఆవేదనతో గొంతు కలిపారు. భారతీయులు సహా ప్రతి ఒక్కరికీ అమెరికాలో స్థిరపడే అవకాశం ఉండాలని అని పార్లమెంటు సభ్యుడు కేవిన్‌ యొదర్‌ అన్నారు. పుట్టుక ప్రాతిపదికగా మనుషులను విభజిస్తామనడం సరికాదని కాంగ్రెస్‌ సభ్యుడు రోన్‌ ఇస్టేస్‌ మండిపడ్డారు.