సత్య నాదెళ్లతో రవి వేమూరు భేటీ

సత్య నాదెళ్లతో రవి వేమూరు భేటీ

08-02-2018

సత్య నాదెళ్లతో రవి వేమూరు భేటీ

అమరావతిలో అభివృద్ధి కేంద్రం ఏర్పాటు ప్రతిపాదనపై మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్లతో, ఆంధ్రప్రదేశ్‌ ప్రవాస తెలుగువారి సంఘం ( ఏపీఎన్నార్టీఎస్‌) అధ్యక్షుడు రవి వేమూరు భేటీ అయ్యారు. ఇటీవల అమెరికాలో పర్యటించి, పలుప్రాంతాల్లో ప్రవాసాంధ్రులతో సమావేశాలు నిర్వహించిన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ తన షెడ్యూల్‌ ప్రకారం న్యూయార్క్‌లో సత్య నాదెళ్లను కలవాల్సి ఉంది. సమయాభావం కారణంగా లోకేశ్‌ ఈ భేటీ జరగకుండానే, తిరుగు ప్రయాణం అయ్యారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరపున రవి వేమూరు, ఏపీఎన్నార్టీ ప్రతినిధులతో వెళ్లి సత్య నాదెళ్లను కలిశారు. తమ ప్రతిపాదన పట్ల సత్య నాదెళ్ల సానుకూలంగా స్పందించారని రవి తెలిపారు.