2016 ఎన్నికలో రష్యా ప్రమేయం : జార్జి బుష్

2016 ఎన్నికలో రష్యా ప్రమేయం : జార్జి బుష్

09-02-2018

2016 ఎన్నికలో రష్యా ప్రమేయం : జార్జి బుష్

2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికలో రష్యా తన స్వార్థ ప్రయోజనాల కోసం కల్పించుకుంది అన్నదానికి అమెరికా వద్ద సృష్టమైన సాక్షాలు ఉన్నాయని అమెరికా 43వ అధ్యక్షుడు, 2001 నుండి 2009 వరకు అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన జార్జి బుష్‌ వ్యాఖ్యానించారు. సౌదీ అరేబియాలోని అబుదాబెలో కాలిఫోర్నియాకు చెందిన ఆర్థిక సంస్థ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ప్రపంచంలో అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశమైన అమెరికా ఎన్నికలలో ఇతర దేశాలు కల్పించుకోవటం జీర్ణించుకోలేమని నిజమని అన్నారు. ఇప్పటికే రష్యాలో పుతిన్‌ అక్కడి సమస్యలను పరిష్కరించలేక పీకల లోతులలో కూరుకుపోయారని, తనను తాను రక్షించు కొనేందుకు ఇలాంటి పన్నాగాలు పన్నుతున్నారని విమర్శించారు. అయితే రష్యా అమెరికా అధ్యక్షుడు ఎన్నికలలో కల్పించుకొని పరోక్షంగా ఓటర్లపై ప్రభావం చూపించిందనటానికి అమెరికా వద్ద ఖచ్ఛితమైన సాక్షాలు అన్నారు. అయితే ఇది ట్రంప్‌కు ఎలా కలిసివచ్చింది అన్నదాన్ని ఆయన సృశించలేదు.