అగ్రరాజ్యంలో కాల్పుల కలకలం
Nela Ticket
Chal Mohan Ranga
Kizen
APEDB

అగ్రరాజ్యంలో కాల్పుల కలకలం

09-02-2018

అగ్రరాజ్యంలో కాల్పుల కలకలం

అగ్రరాజ్యం అమెరికాలో కాల్పుల కలకలం రేగింది. జార్జియా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,  జార్జియాలోని బర్నెట్‌ ఫెర్నీ రోడ్‌ లో గల హైటెక్‌ క్విక్‌ స్టాప్‌ స్టోర్‌ లోకి ఆగంతకుడు తుపాకీతో ప్రవేశించాడు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే స్టోర్‌లోని కౌంటర్‌ వద్ద నిల్చున్న  పరంజిత్‌ సింగ్‌ పై కాల్పులు జరిపాడు. అక్కడి నుంచి పక్కనే ఉన్న మరో స్టోర్‌ లోకి వెళ్లి కౌంటర్‌ వద్ద నున్న క్లర్క్‌, పార్టీ పటేల్‌ పై కాల్పులు జరిపి, కౌంటర్‌లో డబ్బులు దొంగిలించాడు. మొదటి స్టోర్‌లో కాల్పుల్లో గాయపడ్డ పరజింత్‌ సింగ్‌ అక్కడిక్కడే మృతిచెందగా, రెండో స్టోర్‌లో తూటాగాయమైన పార్ధీ తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. దొంగతనం చేసి పారిపోతున్న ఆగంతుకుడ్ని పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు. అతనిని లమర్‌ రషద్‌ నికోల్సన్‌ గా గుర్తించారు. నికోల్సన్‌ నేరచరిత్ర ఉందని, గతంలో దొంగతనం కేసులో జైలు శికక్షూడా అనుభవించాడని వారు తెలిపారు.