మళ్లీ స్తంభించిన అమెరికా ప్రభుత్వం

మళ్లీ స్తంభించిన అమెరికా ప్రభుత్వం

09-02-2018

మళ్లీ స్తంభించిన అమెరికా ప్రభుత్వం

అమెరికా ప్రభుత్వం మళ్లీ మూతపడింది. కీలకమైన బడ్జెట్‌కు ఆ దేశ కాంగ్రెస్‌ ఆమోదం దక్కలేదు. దీంతో కేవలం కొన్ని వారాల వ్వవధిలోనే మరోసారి అమెరికా ప్రభుత్వం స్తంభించింది. ఫెడరల్‌ ఫండింగ్‌ బిల్లు గత రాత్రితో ముగిసిపోయింది. అయితే కొత్త ద్రవ్యపరపతి బిల్లుకు ఆమోదం దక్కాల్సి ఉంది. కానీ అలా జరగకపోవడం వల్ల ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించిపోనున్నాయి. జవవరిలోనూ ద్రవ్యపరపతి బిల్లుకు ఆమోదం దక్కకపోవడం వల్ల మూడు రోజుల పాటు ప్రభుత్వ పనులు నిలిచిపోయిన విషయం తెలిసిందే. సేనేట్‌తో పాటు హౌజ్‌ ఆఫ్‌ రిప్రజెంటెటివ్స్‌ కొత్త బిల్లుకు ఆమోదం తెలుపాల్సి ఉంది. అయితే సేనేట్‌లో ఆమోదం దక్కితేనే ఆ బిల్లుకు హౌజ్‌లో ఆమోదం దక్కే ఛాన్సుంది.