మానవ శరీరమే ఓ ఛార్జర్

మానవ శరీరమే ఓ ఛార్జర్

12-02-2018

మానవ శరీరమే ఓ ఛార్జర్

యంత్రసాధనాలు (గ్యాడ్జెట్స్‌)ను ఛార్జింగ్‌ చేయడానికి ఇప్పటివరకు వాడుతున్న సంప్రదాయ ఛార్జర్లు ఇకపై ఉండవేమో. మానవ శరీరం కదలికల ద్వారా పుట్టే విద్యుత్తుతో యంత్రసాధనాలను ఛార్జింగ్‌ చేసే లోహ ట్యాబ్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధి పరిచారు. దీనిని చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ (కాస్‌) తయారుచేసింది. ఈ రకమైన ఛార్జింగ్‌ కోసం బంగారంతో పాటు కళ్లద్దాల తయారీలో వాడే సిలికాన్‌ ఆధారిత పాలీ డై మిథైల్‌ సిలోక్సేన్‌ పొరలను ఉపయోగించారు. ఈ పొరల మధ్య ఎంత ఎక్కువ ఘర్షణ ఉంటే అంత విద్యుదుత్పత్తి జరుగుతుందని కాస్‌ ప్రొఫెసర్‌ యున్‌ చెప్పారు. ఈ ట్యాబ్‌తో 124 వోల్టుల విద్యుత్తు జనించింది. దీంతో ఒకేసారి 48 ఎర్ర ఎల్‌ఈడీ బల్బులను వెలిగించవచ్చని చెప్పారు.