ట్రంప్ రాసలీలల సమాచారం ఇస్తానంటూ అమెరికా గూఢచారులకు టోకరా

ట్రంప్ రాసలీలల సమాచారం ఇస్తానంటూ అమెరికా గూఢచారులకు టోకరా

12-02-2018

ట్రంప్ రాసలీలల సమాచారం ఇస్తానంటూ అమెరికా గూఢచారులకు టోకరా

అమెరికా గూఢచారులను రష్యా వ్యక్తి బోల్తా కొట్టించాడు. రూ.65 లక్షలకు మంచేసి పరారయ్యాడు. న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం ప్రకారం, అమెరికా జాతీయ భద్రతా సంస్థ (ఎన్‌ఎస్‌ఏ) రూపొందించిన హ్యాకింగ్‌ టూల్స్‌తో పాటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ రాసలీలలకు సంబంధించిన సమాచారం తన వద్ద విక్రయానికి ఉందని రష్యాకు చెందిన ఓ వ్యక్తి షాడో బ్రోకర్ల ద్వారా ఆన్‌లైన్‌లో ప్రకటన ఇచ్చాడు. ఈ ప్రకటన చూసిన అమెరికా నిఘా సంస్థ (సీఐఏ) ఏజెంట్లు అతడిని సంప్రదించారు. వాటిని తాము తీసుకుంటామని అతడితో బేరం కుదుర్చుకున్నారు. అయితే, రూ.6.5 కోట్లు ఇస్తేనే వాటిని విక్రయిస్తానని సదరు రష్యా వ్యక్తి డిమాండ్‌ చేశారు. దీంతో అడ్వాన్స్‌ కింద సీఐఏ ఏజెంట్లు రూ.65 లక్షలు అందజేశారు. ఆ సొమ్మును తీసుకున్న రష్యా వ్యక్తి ఆ తరువాత నుంచి కనిపించకుండా పోయాడు. ఎన్‌ఏస్‌ఏ టూల్స్‌ కానీ, ట్రంప్‌ రాసలీలకు సంబంధించిన సమాచారం కానీ అతడు అందజేయలేదు. దీంతో ఇప్పుడు అతని కోసం అమెరికా గూఢచారులు గాలిస్తున్నారు.