కొలంబస్‌లో టాకో సంక్రాంతి సంబరాలు

కొలంబస్‌లో టాకో సంక్రాంతి సంబరాలు

13-02-2018

కొలంబస్‌లో టాకో సంక్రాంతి సంబరాలు

విదేశాల్లో ఉన్నా సంస్కృతి, సంప్రదాయాలకు తెలుగు ప్రజలు పెద్దపీట వేస్తున్నారు. తెలుగు పండుగలను అత్యంత వైభవంగా నిర్వహించుకుంటున్నారు. అమెరికాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ సెంట్రల్ ఓహియో (టాకో) ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను ప్రవాసులు ఘనంగా జరుపుకున్నారు. కొలంబస్‌లోని వెస్టర్‌విల్లే సౌత్ హైస్కూల్‌లో జరిగిన ఈ వేడుకల్లో 1200 మందికి పైగా ప్రవాసులు పాల్గొన్నారు. చిన్నారులు, యువకులు ఎంతో ఉత్సాహంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు, వెస్ట్రన్ డాన్స్ పర్ఫామెన్స్ చేశారు. దర్శకుడు విశ్వనాథ్‌కు అంకితమిచ్చిన ‘విశ్వనాథామృతం’ అందరినీ ఆకట్టుకుంది. అంతేకాకుండా దేవీశ్రీప్రసాద్ మెలోడీ సాంగ్స్‌కు యువత చేసిన హంగామా.. ఆహుతులను అలరించింది. అయిదేళ్ల లోపు పిల్లలకు వేదికపై భోగిపళ్లు పోశారు. ఓహియో రాష్ట్రంలోని తెలుగు ప్రజలకు అందించిన సేవలకు గానూ గతేడాది టాకో కార్యనిర్వాహక వర్గాన్ని.. 2018వ సంవత్సరానికి గానూ నూతనంగా ఎంపికైన కార్యనిర్వాహక కమిటీ అభినందించింది. సెంట్రల్ ఓహియోలోని తెలుగు ప్రజల కోసం మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహించబోతున్నట్లు టాకో నూతన అధ్యక్షుడు శ్రీకాంత్ మునగాల తెలిపారు. టాకో 2018 కమిటీని ప్రకటించారు. అత్యంత ఘనంగా జరిగిన ఈ సంక్రాంతి సంబరాలకు తానా ప్రెసిడెంట్ సతీష్ వేమన ముఖ్య అతిథిగా హాజరయ్యారు

శ్రీకాంత్ మునగాల అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో వైస్‌ప్రెసిడెంట్(అడ్మిన్) హనుమాన్ కనపర్తి, వైస్ ప్రెసిడెంట్(కమ్యూనికేషన్స్) జగన్నాథ్ చలసాని, వైస్ ప్రెసిడెంట్(కల్చరల్) సుశీల బొమ్మన, వైస్ ప్రెసిడెంట్(స్పోర్ట్స్) హర్ష కామినేని, వైస్ ప్రెసిడెంట్ (మహిళా క్రీడా విభాగం) హారిక బల్లేకరి, వైస్ ప్రెసిడెంట్(ఈవెంట్స్) రంగనాథ్ గుల్లిపల్లి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ ఫణిభూషన్ పొట్లూరి, ట్రెజరర్ వీరేష్ ఉలిగడ్ల, జాయింట్ ట్రెజరర్ స్వామి కావలి, జాయింట్ సెక్రటరీ కాలిప్రసాద్ రాజు మావులేటి, కల్చరల్ కోఆర్డినేటర్లయిన వర్దిని ప్రత్తిపాటి, శిరీష పర్సీ, సుప్రియ తోట, మాథురి ముసునూరి, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ వినోద్ కోస్కే, ఎగ్జిగ్యూటివ్ సెక్రటరీ సుధీర్ కనగాల, వెబ్ కోఆర్డినేటర్ విజయ్ కాకరాల, సోషల్ మీడియా కోఆర్డినేటర్ రజనీకాంత్ అనంతోజి, ఈవెంట్ కోఆర్డినేటర్లయిన ప్రదీప్ చందనం, విజయ్ గౌండ్ మల్లెల, ఫుడ్ కోఆర్డినేటర్లయిన కిషోర్ గాజుల, రజనీకాంత్ కట్టె, ట్రస్టీలు నాగేశ్వరరావు మన్నె, రమేష్ కొల్లి, ప్రసాద్ కాండ్రు, శ్రీధర్ వెగసీన, మురళి పుట్టి తదితరులు పాల్గొన్నారు. 

Click here for Event Gallery