బూర్గంపాడు పాఠశాలల్లో డిజిటల్ తరగతులకు జే తాళ్లూరి విరాళం

బూర్గంపాడు పాఠశాలల్లో డిజిటల్ తరగతులకు జే తాళ్లూరి విరాళం

14-02-2018

బూర్గంపాడు పాఠశాలల్లో డిజిటల్ తరగతులకు జే తాళ్లూరి విరాళం

బూర్గంపాడు మండలంలోని అన్ని పాఠశాలలను డిజిటల్‌ తరగతుల ఏర్పాటుకు తానా కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు జే తాళ్లూరి తోడ్పాటు అందించారు. తాళ్లూరి పంచాక్షరయ్య చారిటబుల్‌ ట్రస్ట్‌, ఎన్నారై ఫౌండేషన్‌ మరియు తానా ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో పంచాక్షరయ్య, జే తాళ్ళూరి తదితరులు ప్రసంగించారు. మండలవ్యాపితంగా అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు హాజరయ్యారు.  ఈ కార్యక్రమంలో తానా ఫౌండేషన్‌ అధ్యక్షుడు నిరంజన్‌, బత్తినేని రాకేష్‌, ఎన్నారై ఫౌండేషన్‌ సభ్యులు శివ, వంశీ వల్లూరివల్లి, అత్తులూరి ఉమామహేశ్వర్‌, మిట్టపల్లి పాండురంగారావు, రమేష్‌ లగడపాటి, రమేష్‌ రాథోడ్‌, బోనాల రామక ష్ణతోపాటు కొంగర పురుషోత్తం, బండి నాగేశ్వర్‌ రావు, బండి సుధీర్‌ తదితరులు పాల్గొన్నారు.