యార్లగడ్డ కృష్ణమూర్తి అస్తమయం

యార్లగడ్డ కృష్ణమూర్తి అస్తమయం

14-02-2018

యార్లగడ్డ కృష్ణమూర్తి అస్తమయం

బాపట్ల పట్టణంలోని కృష్ణమూర్తి నర్సింగ్‌హోమ్‌ వ్యవస్థాపకుడు, బాపట్ల ఎడ్యుకేషన్‌ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ యార్లగడ్డ కృష్ణమూర్తి (90) అమెరికాలో మతి చెందారు. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు ఉత్తమ వైద్యసేవలు అందించేందుకోసం 1955వ సంవత్సరంలో కృష్ణమూర్తి నర్సింగ్‌ హోమ్‌ స్థాపించారు. అప్పటి నుంచి వైద్యసేవలను అందిస్తూ వస్తున్నారు. బాపట్ల ఎడ్యుకేషన్‌ సొసైటీకి 1962 నుంచి 1981 వరకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశారు. విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేశారు.