లాస్ వెగాస్ ఎయిర్ పోర్టులో తక్షణ పెండ్లి లైసెన్సులు

లాస్ వెగాస్ ఎయిర్ పోర్టులో తక్షణ పెండ్లి లైసెన్సులు

14-02-2018

లాస్ వెగాస్ ఎయిర్ పోర్టులో తక్షణ పెండ్లి లైసెన్సులు

వాలెంటైన్స్‌డే రోజున వివాహబంధంలో ఒక్కటవ్వాలనుకొనే ప్రేమపక్షులకు తక్షణమే ధ్రువీకరణ పత్రాలిచ్చే సదుపాయానల్ని ఓ సంస్థ అమెరికాలోని లాస్‌వెగాస్‌ ఎయిర్‌పోర్టులో కల్పించింది. క్లార్క్‌ కౌంటీ అనే సంస్థ లాస్‌వెగాస్‌లోని మెక్‌కారన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక మ్యారేజ్‌ లైసెన్స్‌ బ్యూరోను ప్రారంభించింది. గత శనివారం నుంచే ఈ సంస్థలో పేర్లు నమోదు చేసుకొనేందుకు జంటలు బారులు తీరాయి. క్లార్‌ కౌంటీ సంస్థ 77 డాలర్లకే ప్రతి ఏటా సుమారు 80వేల వివాహ లైసెన్సులను జారీ చేస్తున్నది. వీటిలో కనీసం 1500 లైసెన్సులను వాలెంటైన్స్‌ డే రోజున అందిస్తున్నది.