ఇంటర్నెట్ సృష్టికర్త లేరు
Nela Ticket
Chal Mohan Ranga
Kizen
APEDB

ఇంటర్నెట్ సృష్టికర్త లేరు

17-04-2017

ఇంటర్నెట్ సృష్టికర్త లేరు

నేడు ప్రపంచం అంతా అరచేతితో ఉందంటే అది ఇంటర్నెట్‌ మహిమే. ఏ విషయం ఎప్పుడు కావాలన్నా, దేని గురించైనా సమాచారం కావాలంటే ముందు మనం వెతికేది ఇంటర్నెట్‌లోనే. మనకు కావాల్సిన సినిమాలు, ఆటలు, పాటలు ఇలా ఏది కావాలన్నా ఇంటర్నెట్‌ నుంచే డౌన్‌లోడ్‌ చేసుకుంటాం. ప్రపంచనలు మూలల్లో ఏ మూలన ఉన్నా స్మార్ట్‌ఫోన్‌తో లాప్‌టాప్‌తో వీడియో కాల్‌లో చూసుకుంటూ మాట్లాడుతున్నారు. ఇదంత ఇంటర్నెట్‌ మహత్యమే. 

ఈ ఇంటర్నెట్‌ సృష్టి  60 ఏళ్ల కింద జరిగింది. కాలిఫోర్నియాకు చెందిన రాబర్ట్‌ టేలర్‌ దీనికి బీజం వేశారు. నేటి ఆధునిక సమాజానికి పునాది వేసిన రాబర్ట్‌ టేలర్‌ 85 ఏళ్ల వయస్సులో మరణించారు. 1960 దశాబ్దంలో టేలర్‌ పెంటగాన్‌ రీసెర్చ్‌ ప్రాజెక్టు ఏజెన్సీలో సైంటిస్ట్‌గా పని చేశారు. ఒక కంప్యూటర్‌ నుంచి మరో కంప్యూటర్‌కు సమాచారం చేరవేయడానికి ప్రత్యేకమైన ఇంటర్‌ కనెక్ట్‌ కంప్యూటర్‌ నెట్‌వర్క్‌ను సృష్టించారు. 1969 అక్టోబర్‌ 29న టేలర్‌ శాన్‌ఫర్డ్‌లోని శాన్‌ఫర్డ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు తొలి ఎలక్ట్రానిక్‌ సందేశం పంపించారు. అలా ఆ రోజు మొదలైన నెట్‌వర్క్‌నే ఈ రోజు మనం వాడుతున్న ఇంటర్నెట్‌. అనంతరం తన పరిశోధనలకు 1999లో బిల్‌ క్లింటన్‌ నేషనల్‌ మోడల్‌ ఆఫ్‌ టెక్నాలజీ అవార్డు వచ్చినా టేలర్‌ దానిని పెద్దగా పట్టించుకోలేదు.