అమెరికాలో మరోసారి కాల్పులు
APEDB

అమెరికాలో మరోసారి కాల్పులు

17-04-2017

అమెరికాలో మరోసారి కాల్పులు

అమెరికాలో మరోసారి గన్‌ పేలింది. అర్థరాత్రి తర్వాత ఆదివారం వేకువ జామున ఒహియోలోని ఓ క్లబ్‌లో కాల్పులు సంభవించాయి. ఈ ఘటనలో తొమ్మిదిమంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అక్కడి పోలీసులు తెలిపారు. ఈశాన్య కొలంబస్‌లో ఆదివారం తెల్లవారు జామున తమకు కాల్పుకు సంబంధించిన సమాచారం అందిందని, అక్కడి వెళ్లి చూసేవరకు భయానక వాతావరణం కనిపించిందని చెప్పారు. కాల్పులు జరిపింది ఎవరనే విషయం ఇంకా తెలియరాలేదని, పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టి నిందితుల కోసం గాలిస్తున్నారని మరిన్ని వివరాలు రావాల్సి ఉందని వివరించారు.