న్యూజెర్సిలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

న్యూజెర్సిలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

19-02-2018

న్యూజెర్సిలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

న్యూజెర్సిలో తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ యుఎస్‌ఎ కన్వీనర్‌ శ్రీనివాస్‌ గనగోని. న్యూజెర్సి ఇన్‌ఛార్జీ మహేష్‌ పొగాకు ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఎడిసన్‌లోని మిర్చి రెస్టారెంట్‌లో ఘనంగా నిర్వహించారు. రవి దన్నపునేని, దేవేందర్‌ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ గనగోని మాట్లాడుతూ, తెలంగాణ సాధించుకోవడమే కాకుండా దానిని బంగారు తెలంగాణగా మార్చడానికి కేసీఆర్‌ కృషి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి ఎన్నారైలు తమ వంతుగా చేయూతనివ్వాలని కోరారు.