బంగారు రథం మీద ఊరేగాలి!
Nela Ticket
Chal Mohan Ranga
Kizen
APEDB

బంగారు రథం మీద ఊరేగాలి!

17-04-2017

బంగారు రథం మీద ఊరేగాలి!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 రథం కావాలట. లండన్‌ పర్యటన సందర్భంగా ఆరు తెల్ల గుర్రాలు పూన్చిన బంగారు రథం మీద ఊరేగాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఉవ్విళ్లూరుతున్నారు. అధికారిక పర్యటనకు వచ్చే ప్రపంచ స్థాయి నేతలను బ్రిటిష్‌ రాణకి చెందిన ఈ బంగారు రథంపై ది మాల్‌ ప్రాంతం నుంచి బకింగ్‌హాం రాజప్రసాదం వరకు ఊరేగింపుగా తీసుకెళ్లడం ఆనావాయితీగా వస్తోంది. అక్టోబరు రెండో వారంలో ఆయన పర్యటన ఉండడంతో అమెరికా అధికారులు ఈ మేరకు సమాచారం కూడా పంపించారు. అయితే బ్రిటిష్‌ అధికారులు మాత్రం ఇందుకు అంగీకరించడం లేదు. ట్రంప్‌కు వ్యతిరేకంగా వేలాది మంది ప్రదర్శన జరిపే అవకాశం ఉన్నందున భద్రతపరంగా కష్టమవుతుందని వారు అంటున్నారు. అందువల్ల బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనంలో వెళ్లడమే మేలని సూచిస్తున్నారు.