పి.ఆర్. కాలేజ్ (స్వయం ప్రతిపత్తి) ప్రవేశ ద్వార పునర్నిర్మాణం ప్రారంభం
Nela Ticket
Chal Mohan Ranga
Kizen
APEDB

పి.ఆర్. కాలేజ్ (స్వయం ప్రతిపత్తి) ప్రవేశ ద్వార పునర్నిర్మాణం ప్రారంభం

18-04-2017

పి.ఆర్. కాలేజ్ (స్వయం ప్రతిపత్తి) ప్రవేశ ద్వార పునర్నిర్మాణం ప్రారంభం

మొన్నీ మధ్య ‘గాన గంధర్వుడు” S.P. బాలూ హ్యూస్టన్ వచ్చినప్పుడు మాటల సందర్భంలో “మీరు కాకినాడ పి.ఆర్. కాలేజ్ లో చేపట్టిన కార్యక్రమాలు చాలా బావున్నాయి. మంచి పని” ” అనగానే నాకు భలే సిగ్గేసింది. ఎందుకంటే ఆ కార్యక్రమాలన్నీ అక్కడి వారే తలపెట్టి, కష్టపడి ఆయా పనులు చేపట్టి విజయవంతం చేస్తున్నారు కాబట్టి ఆ మెచ్చుకోలు వారికే చెందుతుంది.  నేను చేస్తున్నది కేవలం ప్రచారం చెయ్యడం,  కాస్తో, కూస్తో విరాళాలు పోగు చేసి, వ్యక్తిగతంగా నా స్తోమతకి తగిన ఆర్ధిక సహాయం చెయ్యడం, సలహాలు చెప్పడం మాత్రమే. అమెరికా వాడిని కాబట్టి అక్కడి వారికి ఇది మరింత ప్రోత్సాహం ఇస్తోంది అనడంలో అతిశయోక్తి లేదు అని మాత్రం చెప్పగలను.

అసలు విషయం ఏమిటంటే...గత నాలుగైదేళ్లగా ఎప్పుడు కాకినాడ పి.ఆర్. కాలేజ్ ప్రాగణంలో అడుగుపెట్టినా ఆ “పరివేశ దవారం” (మాయా బజార్ లో లంబూ-జంబూ వాడిన మాట)...అనగా లోపలికి వెళ్ళే గేట్ ఆ కళాశాల ప్రతిష్టకి తగినట్టుగా లేక మాకు “అదోలా” ఉండేది. ఎప్పుడైనా ఆ ద్వారాన్ని మంచి దర్జాగా, అందరికీ గర్వంగా ఉండేలా పునర్నిర్మించాలని అందరం అనుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు ఆ ముహూర్తం వచ్చింది. మా పూర్వ విద్యార్థుల సంఘం వారే కాక, సాక్షాత్తూ ప్రిన్సిపాల్ డా. చప్పిడి కృష్ణ గారే దానికి తగిన ప్రాధాన్యత ఇచ్చి తనకి ఉన్న అతి కొద్ది నిధుల్లో లక్ష రూపాయలు కేటాయించారు. వెనువెంటనే పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు కర్రి భామి రెడ్డి గారు,  యనమండ్ర సూర్యనారాయణ మూర్తి,  పి. రఘు రామారావు మొదలైన వారు ఆ  ప్రవేశ ద్వారం సరికొత్త పద్ధతిలో డిజైన్ చేసి ఆ పనులు చేపట్టారు.

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తో పునర్నిర్మించబడుతున్న ఈ ముఖద్వారం స్థంభాలు గ్రానైట్ తో తాపడం చేయబడతాయి. ఆకర్షనీయమైన అక్షరాలతో కళాశాల పేరు ముద్రించబడి విద్యార్థులకి ఉత్తేజాన్ని కలిగిస్తూ  అలనాటి విద్యా వైభవాన్ని తలపించేలా ఉంటుంది.

ఇప్పుడే మొదలు పెట్టిన ఆ ప్రవేశ ద్వారం డిజైన్, పనులు జరుగుతున్న ఫోటోలు ఇందుతో జతపరుస్తున్నాను.

ఈ పునర్నిర్మాణానికి కాలేజ్ యాజమాన్యం మంజూరు చేసిన లక్ష కాక మరో మూడు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. మనలో ఆసక్తి ఉన్న్న దాతలు అందరం కలిసి ఆ మూడు లక్షలు సేకరించగలం అని ఆశిస్తున్నాను.

Request for Tax-Deductible Donation in USA & India 

(Construction of Entrance Gate at P.R. College, Kakinada)  

(All donor names will be prominently displayed in the Auditorium)

We request your generous donations to pay for the reconstruction of the Entrance Gate of P.R. College, Kakinada.

Matching Donations by Vanguri Foundation of America, Inc

Vanguri Foundation of America, Inc (VFA) is very happy to match 100 % of any donations received in USA or India.  In other words, if you donate say US$500, VFA will match with a donation of US$500 for this cause. Similarly, if anyone donates ..say Rs. 5000 in India, VFA will match a donation of Rs. 5000.  

Please note last date to receive all donations in USA or India for this project is May 15, 2017.

The total donations required for this Entrance Project is Rs. 3 Lacs ($5,000) and any excess donations received will be used for the on-going Open Air Auditorium Project.  

Suggested Donation Categories

USA: $100 to $1,000

India: Rs. 1,000 to Rs. 50,000

(All donations in USA are tax-deductible. Please contact us for tax-dedcution in India) )

HOW TO DONATE IN USA

On-Line

You can copy & paste the following URL and follow prompt.

https://www.paypal.com/cgi-bin/webscr?cmd=_s-xclick&hosted_button_id=3R29K3F2QREMQ

or simple log into www.vangurifoundation.blogspot.com, click on DONATE button and follow the prompts.

BY CHECK

       Please make check payable to Vanguri Foundation of America and mail to:

Vanguri Foundation of America, Inc

P .O Box 1948

Stafford, TX 77497


BY CHECK IN INDIA

HOW TO DONATE IN INDIA

Make checks payable to P R COLLEGE (A) OLD STUDENTS ASSOCIATION and mail to

C/O Y. S. N. MURTHY

7-4-20 SESHA SAI STREET,

RAMARAO PET

KAKINADA-533004, A.P

Tel: +91 9440932342

                  BY ELECTRONIC WIRE TRASNFER (NEFT) IN INDIA

Account Name: P R COLLEGE (A) OLD STUDENTS ASSOCIATION

 

BANK :

 

State Bank of India, (04244), Suryaraopet Branch, Kakinada 533001.

Current Account No. 34869872449.

IFS Code: SBIN 0004244

 

                            మీ సత్వర స్పందనకు, దాతృత్వానికి  ముందు గానే మా ధన్యవాదాలు.

Sincerely,

 

వంగూరి చిట్టెన్ రాజు: (Houston, TX)

Phone: 832 594 9054, E-mail: vangurifoundation@gmail.com

YSN Murthy: (Kakinada)

E-mail: murtyyenamandra@yahoo.com,  Phone: 94409 32342

Dr. Murty Mutyala (Houston, TX.), E-mail: mutyala41@yahoo.com

Chandra Turaga (Hyderabad): e-mail: cturaga@nhsiusa.com,  Phone: 093913-87368