సిలికానాంధ్ర ఉగాదిలో పంచ ఘట నాదలయ విన్యాసం
Telangana Tourism
Vasavi Group
Manjeera Monarch

సిలికానాంధ్ర ఉగాదిలో పంచ ఘట నాదలయ విన్యాసం

18-04-2017

సిలికానాంధ్ర ఉగాదిలో పంచ ఘట నాదలయ విన్యాసం

మిల్పిటాస్‌ నగరంలోని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం -లకిరెడ్డి హనిమిరెడ్డి భవనంలో శ్రీ హేవళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలను  వైభవంగా జరిపారు. ఈ సందర్భంగా  రెండు విభిన్న కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. పంచ ఘట లయవిన్యాసం, వాద్య సంగీతం గోష్టి (ప్యుజన్‌) కార్యక్రమాలు అలరించాయి. ప్రపంచ ప్రఖ్యాత ఘటవాయిద్య విద్వాంసులు, పద్మభూషణ్‌ విక్కు వినాయకరాం, తన శిష్య బృందంతో నిర్వహించిన పంచ ఘట నాదలయ విన్యాసం తో ఆకట్టుకున్నారు. వినాయకరాం మాట్లాడుతూ, సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఒక పవిత్రతో కూడిన దివ్వత్వం ఉన్నట్లుగా అనుభూతి కలుగుతోందని అన్నారు. విశ్వవిద్యాలయం ఏ ఆశయం కోసం ప్రారంభించారో అది తప్పక నేరవేరుతుందని, తానూ ఇందులో భాగమై, విద్యార్థులకు విద్య నేర్పడానికి సిద్ధమని ప్రకటించారు.

సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం తరగతుల కరపత్రాలు, గోడపత్రికను ఆయన ఆవిష్కరించి, డాక్టర్‌ లకిరెడ్డి హనిమిరెడ్డి, యూనివర్సిటీ కార్యవర్గానికి అందించారు. బ్రహ్మశ్రీ మారేపల్లి, నాగ వెంకట శాస్త్రి హేమలంబ ఉగాది పంచాంగ పఠనంతో సాయంత్రపు ఉగాది వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం నిర్వహించిన కవి సమ్మేళనం మధు ప్రఖ్యసంధాతగా, ఎంతో ఆసక్తిగా నిర్వహించారు.ఉగాది సందర్భంగా పిల్లలకు నిర్వహించిన భాషా వికాస పోటీల విజేతలకు బహమతులు అందించారు. హైదరాబాద్‌ నుంచి విచ్చేసిన అన్నవరపు రామస్వామి శిష్యులు దేవన్‌ డ్రోన్‌గా చిరపరిచితులైన కళాకారులు, వయోలిన్‌ వాసుదేవన్‌, ప్లూట్‌ ఫణిలు నిర్వహించిన వాయులీన వేణుగాన నాదామృత వర్షిణి కార్యక్రమం ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఆనంద్‌ కూచిభొట్ల మాట్లాడుతూ, యువతే రేపటి భవిత అనే సిద్ధాంతం సిలికానాంధ్ర ఎల్లప్పుడూ నమ్ముతుందని, అందుకే ప్రతిభావంతులైన యువ కళాకారులకు ఎల్లప్పుడూ సిలికానాంధ్ర వేదిక స్వాగతం పలుకుతుందని అన్నారు.  ఎంజె తాటిపాముల, ఫణిమాధవ్‌ కస్తూరి రూపొందించిన సిలికానాంధ్ర అంతర్జాల పత్రిక సుజనరంజని కొత్త పోర్టల్‌ విడుదల చేశారు. రత్నమాల వంక, మాధవ కిడాంబి, పద్మహరి, సిద్దార్థ్‌ నూకల, సాయి కందుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దిలీప్‌ కొండిపర్తి, రాజు చమర్తి, దీనబాబు కొండుభట్ల, ప్రభ మాలెంపాటి, సంజీవ్‌ తనుగుల, రవీంద్ర కూచిభొట్ల తదితరులు పాల్గొన్నారు.


Click here for Event Gallery