న్యూయార్క్‌లో తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టాటా) అన్నదానం
Nela Ticket
Chal Mohan Ranga
Kizen
APEDB

న్యూయార్క్‌లో తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టాటా) అన్నదానం

18-04-2017

న్యూయార్క్‌లో తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టాటా) అన్నదానం

తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (టి.ఎ.టి.ఎ) కమ్యూనిటీకోసం వివిధ  కార్యక్రమాలను నిర్వహిస్తోంది.  ఆపదలో ఉన్న వారికి చేయూతనందిస్తోంది. ఇంటి నుండి దూరంగా ఉంటున్న వారి కోసం సర్వ్‌ ఎ మీల్‌ పేరిట ఇటీవల ఓ కార్యక్రమం నిర్వహించి, ఇందులో భాగంగా న్యూయార్క్‌లోని మెక్‌ డోనాల్డ్‌ హౌస్‌లో 150 మందికి చీజ్‌ సాండ్‌విచ్‌, చికెన్‌ సలాడ్‌, తున సలాడ్‌, బెక్డ్‌ ఓట్‌ మీల్‌, ముఫిన్స్‌, కేక్స్‌, కుకీస్‌ను ఉచితంగా అందజేసింది.

టాటా ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు భారత్‌తో పాటు విదేశాల్లోనూ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు ఈ సంస్థ రీజనల్‌ ఉపాధ్యక్షుడు రంజీత్‌క్యాతమ్‌ తెలిపారు. 2016 డిసెంబర్‌లో ఆహార ప్యాకెట్లు పంపిణీ విజయవంతంగా నిర్వహించామని,  వరంగల్‌లో టి.ఎ.టి.ఎ అధ్యక్షులు ఝాన్సీ రెడ్డి, కో ఆర్డినేటర్‌ పవన్‌ రవ్వల ఆధ్వర్యంలో పాఠశాల భవన సముదాయానికి కావాల్సిన వస్తువులను సేకరించి అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ పైలా మల్లారెడ్డి, డాక్టర్‌ సుధాకర్‌ వైదియాల, శరత్‌ వేముగంటి, సహోదర్‌ పెద్దిరెడ్డి, పవన్రవ్య, ఉషా మన్నెం, మల్లిక్‌ అక్కినపల్లి, సత్యారెడ్డి, జి.శ్రీనివాస్‌ గంధం, యోగి వనమా, రమా వనమా, జయప్రకాశ్‌ ఇంజాపురి, హేమంత్‌ కంచర్ల, రజిత్‌ కనపర్తి, వీనా సనుగుల, అశోక్‌ కె చింతకుంట, మాధవి సోలిటీ, శ్రీనివాస్‌ గుడూరు తదితరులు పాల్గొన్నారు.