అమెరికా బాటలో ఆస్ట్రేలియా
Nela Ticket
Chal Mohan Ranga
Kizen
APEDB

అమెరికా బాటలో ఆస్ట్రేలియా

18-04-2017

అమెరికా బాటలో ఆస్ట్రేలియా

మొన్న అమెరికా, నిన్న సింగపూర్‌ ఇప్పుడు ఆస్ట్రేలియా వీసాల జారీ విషయంలో ఇండియన్స్‌కు వరుసగా షాకిస్తున్నాయి. విదేశీ ఉద్యోగులు ఆస్ట్రేలియాలో పని చేసేందుకు వీలుగా ప్రతి ఏడాది 95 వేల వీసాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఆ దేశం రద్దు చేసుకుంది. దీనికి ఆ దేశం చెప్పిన కారణం కూడా అదే. స్థానికంగా నిరుద్యోగం పెరిగిపోతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆస్ట్రేలియా సృష్టం చేసింది. 457 వీసాగా దీనిని పిలుస్తారు. దీని కింద స్థానికంగా ఆస్ట్రేలియన్లు అందుబాటులో లేని సమాయాల్లో అక్కడి కంపెనీలు విదేశీ ఉ ద్యోగులను గరిష్ఠంగా నాలుగేళ్ల కాలానికి తీసుకునే వీలు ఉంటుంది. మాది వలస దేశమే. అయితే ఉద్యోగాల విషయంలో మాత్రం ఆస్ట్రేలియన్స్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకే 457 వీసాను రద్దు చేస్తున్నాం అని ఆస్ట్రేలియా ప్రధాని మాల్కమ్‌ టర్న్‌ బుల్‌ వెల్లడించారు.  దీని ప్రభావం 95,000 వీసాలపై పడనుంది. ఈ వీసాలను అత్యధికంగా భారతీయులే వినియోగిస్తుంటారు. దీంతో భారతీయ ఉద్యోగులపై దీని ప్రభావం ఎక్కువగా పడే అవకాశం కనిపిస్తోంది.