న్యూజెర్సిలో ఈస్టర్‌ అన్నదాన కార్యక్రమం
Nela Ticket
Chal Mohan Ranga
Kizen
APEDB

న్యూజెర్సిలో ఈస్టర్‌ అన్నదాన కార్యక్రమం

18-04-2017

న్యూజెర్సిలో ఈస్టర్‌ అన్నదాన కార్యక్రమం

తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (టాటా) ఆధ్వర్యంలో  ఈస్టర్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని న్యూజెర్సీలోని మౌంట్‌ హోలీ గ్రామంలో ఓట్స్‌ డౌన్‌ టౌన్‌ పబ్‌ అండ్‌ గ్రిల్‌  లో 400 మంది పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాతగా వ్యవహరించిన తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ బోర్డు ఆఫ్‌ డైరెక్టర్‌, ఓట్స్‌ డౌన్‌ గ్రిల్‌ అధిపతి డా. రామిరెడ్డి మల్లాది తనకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. రామిరెడ్డి దాతృత్వాన్ని, టాటా, కార్యవర్గాన్ని  సంస్థ సలహ సంఘం అధ్యక్షుడు డా.పైళ్ల మల్లారెడ్డి అభినందించారు. తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (టాటా) అధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి మాట్లాడుతూ తెలుగు వారికి దాన గుణం చాల ఎక్కువ అని, వారె ప్పుడు ఎదుటివారికి సహాయం చేయటంలో ముందుంటారని, ఈ సంస్థలో పనిచేసే ప్రతి వ్యక్తి మంచి మనసు కలిగినవారని కొనియాడారు. తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (టాటా) ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌ మహేందర్‌ ముసుకు మాట్లాడుతూ టాటా యువశక్తి వలన ఇటువంటి   కార్యక్రమాలు సాధ్యపడుతున్నాయని పేర్కొన్నారు. బీకాన్‌ అఫ్‌ హోప్‌ సేవా సంస్థ , న్యూజెర్సీ డైరెక్టర్‌ డార్లిం ఈస్టర్‌ లంచ్‌ డొనేషన్‌ కు టాటా తమను ఎంచుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తె లియజేసారు.

తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ ముఖ్య సలహాదారులు డా.హరినాథ్‌ పొలిచెర్ల, డా.మోహన్‌ పట్లోళ్ల,  డా.విజయపాల్‌ రెడ్డి, డా.సుధాకర్‌ విడియాలా మరియు టాటా ఎగ్జిక్యూటివ్‌ వర్గం శ్రీనివాస్‌ రెడ్డి అనుగు, భరత్‌ మదాడి, విక్రమ్‌ జంగం,  మహేష్‌ ఆదిభట్ల, అనిల్‌ ఎర్రెబల్లి, ఫణి భూషన్‌ తదితరులు ఈస్టర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ  కార్యక్రమంలో ఫిలడెల్ఫియా  బోర్డు ఆఫ్‌ డైరెక్టర్‌ సురేష్‌ వెంకన్న గారి, రీజినల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ధనరాజ్‌ శేరి, శ్రీనివాస్‌ రెడ్డి పాతూరి, ప్రసాద్‌ కునారపు, వేణు ఇనుగాల, టాటా నేషనల్‌ లాంగ్వేజెస్‌ చైర్‌ నరసింహ రెడ్డి దొంతిరెడ్డి, మూడు రాష్ట్రాలు న్యూజెర్సీ , ఫిలడెల్ఫియా మరియు డెలావేర్‌ కార్యవర్గ సభ్యులు  డా.స్వామి బొడిగె, కళావతి, రమణ రెడ్డి కొత్త, అమర్‌ వెల్మాలా, వంశీ గుళ్ళపల్లి, ప్రశాంత్‌ వేముగంటి, సత్యయాలాల, వెంకట్‌ ముక్కామల, విజయ్‌ వైద్యుల సుధీర్‌ మిర్యాల, బస్వారాజ్‌ తమ్మాలి, పృద్విరెడ్డి,  బిందు మాదిరాజు రాజులక్ష్మి పాతూరి, సింధు యాలాల, శ్యామ్‌ బోనగిరి, గంగాధర్‌ ఉప్పల, ప్రశాంత్‌ చింతవర్‌, శశి కసిరా  కిరణ్‌ గూడూరు సతీష్‌ సుంకనపల్లి, సతీస్‌ మేకల, శ్రీనివాస్‌ దూళిపాళ్ల, రవి పెద్ది, బేబీ సహస్ర, బేబీ యోషిత తదితరులు పాల్గొన్నారు.