ఆ బాలుడు 50 మందిని చంపాలనుకున్నాడు

ఆ బాలుడు 50 మందిని చంపాలనుకున్నాడు

05-03-2018

ఆ బాలుడు 50 మందిని చంపాలనుకున్నాడు

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని పాఠశాలలో ఓ 14 ఏండ్ల బాలుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపి 17 మందికి పైగా చిన్నారులను పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. పాఠశాల నుంచి సస్పెండ్‌ చేసినందుకు కోపంతో ఈ విపరీత చర్యకు పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. అతనికి తుపాకులన్నా, ఇతరులను చంపడమన్నా కూడా ఇష్టమేనని పేర్కొన్నారు. అయితే ఆరోజు పాఠశాలలో జరిపిన కాల్పుల్లో దాదాపు 50 మందిని చంపాలని బాలుడు పథకం వేశాడట. తాజా విచారణంలో ఆ బాలుడి ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను పరిశీలిస్తే భయంకరమైన విషయాలు బయటపడ్డాయి. ఎవరెవర్ని చంపాలి? ఎలా చంపాలి? వంటి విషయాలను ఓ పోస్ట్‌లో రాసిపెట్టుకున్నాడట. తన తండ్రి ట్రక్కు తాళాలు దొంగిలించి, తాను చదువుతున్న పాఠశాలకు వెళ్లి విచక్షణారహితంగా కాల్పులు జరపాలని అనుకున్నాడు. కాల్పులు జరిపే సమయంలో టీచర్లు పాఠశాల నుంచి బయటికి పారిపోకుండా వారి వద్ద ఉన్న తాళాలు లాక్కోవాలనుకున్నాడు. తాను చదువుతున్న పాఠశాలలోనే కాదు దగ్గరల్లోని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల గురించి ఆరా తీసినట్టు పోలీసులు తెలిపారు. గతంలో పాఠశాలల్లో జరిగిన కాల్పుల్లో ఎంత మంది చనిపోయారు. అన్న సమచారాన్ని కూడా సేకరించాడు. ఇతర హంతకులతో పోలిస్తే తాను వారికంటే ఎక్కువగా కాల్చాలని కుదిరితే ఏకంగా 150 మందిని హతమార్చాలని పథకం రచించాడు.