వైట్ హౌస్ ఎదుట కలకలం

వైట్ హౌస్ ఎదుట కలకలం

05-03-2018

వైట్ హౌస్ ఎదుట కలకలం

అమెరికాలోని వైట్‌హౌస్‌ ముందు జనసమర్థ బాటపై ఓ శ్వేత జాతియుడు తనను తాను తలకు ఘోరంగా కాల్చుకున్నాడు. ఈ ఘటన శనివారం జరిగింది కానీ ఈ విషయాన్ని అక్కడి సీక్రెట్‌ సర్వీస్‌ అదివారం తెలిపింది. ఈ దుర్ఘటన జరిగిన సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఆయన భార్య మెలానియా ఫ్లోరిడాలో ఉన్నారు. శ్వేత జాతియుడు దాపెట్టి తెచ్చుకున్న తుపాకీని తీసి అనేక రౌండ్లు కాల్చుకున్నాడు. కానీ అతడు ఎవరిని లక్ష్యం చేసుకుని ఈ కాల్పులు జరపలేదని సీక్రెట్‌ సర్వీస్‌ ప్రతినిధి చెప్పారు. అగంతకుడు తనను తాను కాల్చుకోడానికి ముందు తన ఫోన్‌ను కాల్చాడు. ఎలాంటి సూసైడ్‌ నోట్‌ను కూడా వదిలి పెట్టలేదు. అయితే ఘటనా స్థలిలో దొరికన పుస్తకంలో అవాంఛనీయ వాక్యాలు కనిపించాయి. అగంతకుడు తప్ప మరెవరూ ఈ ఘటనలో గాయపడలేదు. ఈ ఘటనను వాషింగ్టన్‌ డిసి మెట్రోపాలిటన్‌ పోలీస్‌ శాఖ దర్యాప్తు చేస్తున్నది.