విభజన హామీలు నెరవేర్చాలంటూ ఎన్నారైల ఆందోళన

విభజన హామీలు నెరవేర్చాలంటూ ఎన్నారైల ఆందోళన

05-03-2018

విభజన హామీలు నెరవేర్చాలంటూ ఎన్నారైల ఆందోళన

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సహా విభజన చట్టంలోని హామీలు నెరవేర్చాలంటూ అమెరికాలోని ప్రవాసాంధ్రులు డిమాండ్‌ చేశారు. నార్త్‌ కరోలినాలో ప్లకార్డులతో నినాదాలు చేశారు. ఆర్థిక లోటుతో ఇబ్బంది పడుతున్న రాష్ట్రాన్ని  కేంద్రం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుకు సకాలంలో నిధులు ఇవ్వడంతోపాటు వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలన్నారు. ఇప్పటికే నాలుగేళ్లు గడిచినందును వెంటనే కేంద్రం స్పందించాలని కోరారు. సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌-సేవ్‌ డెమొక్రసీ అంటూ నినాదాలు చేశారు.