యునిసెఫ్ ఓ శుభవార్త చెప్పింది

యునిసెఫ్ ఓ శుభవార్త చెప్పింది

06-03-2018

యునిసెఫ్ ఓ శుభవార్త చెప్పింది

ఐక్యరాజ్యసమితికి చెందిన యునిసెఫ్‌ ఓ శుభవార్త చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా బాల్యవివాహాలు తగ్గుతున్నాయని ఆ సంస్థ వెల్లడించింది. గత దశాబ్ధంలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 2.5 కోట్ల బాల్యవివాహాలను అడ్డుకున్నారు. 18 ఏండ్లు వచ్చేలోపు ప్రతి అయిదుగురిలో ఒక అమ్మాయికి ముందే పెళ్లి జరుగుతోంది. అయితే ఓ దశాబ్ధం క్రితం ఈ పరిణామం మరో విధంగా ఉండేది. అప్పట్లో ప్రతి అయిదుగురిలో నలుగురు అమ్మాయిలు 18 ఏళ్ల లోపే పెళ్లి చేసుకునేవారు. దక్షిణ ఆసియా దేశాల్లో బాల్య వివాహాలు చాలా తగ్గు ముఖం పట్టాయని యునిసెఫ్‌ తన నివేదికలో సృష్టం చేసింది. బాలికలకు ఉత్తమ విద్యను అందించడం ద్వారా భారత్‌లో బాల్యవివాహాలు తగ్గినట్లు తెలుస్తోంది. బాల్యవివాహాల వల్ల కలిగే సమస్యల గురించి కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహించడం పట్ల ఈ మార్పు చోటుచేసుకున్నది. ప్రస్తుతం ఆఫ్రికాలో చైల్డ్‌ మ్యారేజస్‌ సమస్య ఎక్కువగా ఉన్నట్లు యునిసెఫ్‌ వెల్లడించింది.