హెల్మెట్ వల్ల మరో లాభం

హెల్మెట్ వల్ల మరో లాభం

07-03-2018

హెల్మెట్ వల్ల మరో లాభం

తలకు దెబ్బ తాకకుండా హెల్మెట్‌ రక్షణగా నిలుస్తుంది. అయితే, దాని వల్ల మరో లాభం కూడా ఉందంటున్నారు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ మిస్కాన్సిస్‌ శాస్త్రవేత్తలు. ప్రమాదాలు జరిగినపుడు వెన్నెముకకు భారీ దెబ్బలు తగలకుండా హెల్మెట్‌ కాపాడుతుందని తెలిపారు. పూర్తిగా కాకపోయినా, 2010-2015 మధ్య జరిగిన రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్‌ ధరించినవారు, ధరించనివాళ్ల డేటాను పరిశీలించగా హెల్మెట్‌ పెట్టుకున్నవాళ్ల వెన్నెముకకు గాయాలు తక్కువగా అయినట్లు తేలిందన్నారు.