ట్రంప్‌పై దావా వేసిన స్టోర్మీ డేనియల్స్‌

ట్రంప్‌పై దావా వేసిన స్టోర్మీ డేనియల్స్‌

08-03-2018

ట్రంప్‌పై దావా వేసిన స్టోర్మీ డేనియల్స్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై స్టోర్మీ డేనియల్స్‌ అనే నటి న్యాయ పోరాటానికి సిద్ధమైంది. కాలిఫోర్నియాలోని కోర్టులో ట్రంప్‌పై ఆమె దావా వేసింది. ట్రంప్‌తో తనకు అక్రమ సంబంధముందని ఆరోపించింది. ఈ విషయాన్ని బయటపెట్టకుండా ఉండేందుకు అధ్యక్ష ఎన్నికల ముందు ట్రంప్‌ న్యాయవాది తనను బెదిరించాడని పేర్కొన్నది. అక్రమ సంబంధం విషయం బయటకు పొక్కకుండా ఉంచేలా తనతో బలవంతంగా సంతకం చేయించాడని ఆరోపించింది. 2016లో తాను ఓ ఒప్పంద పత్రంపై బలవంతంగా సంతకం చేశానని పేర్కొన్నది. అయితే, స్టోర్మీ చేసిన ఆరోపణలను ట్రంప్‌ ఖండించారు. మీడియాకు స్టోర్మీ వెల్లడించిన వివరాల ప్రకారం, ట్రంప్‌తో అఫైర్‌ను బయటపెట్టకుండా ఉండేందుకు ఆయన న్యాయవాది మైకేల్‌ కోహెన్‌ తనకు 1,30,0000 డాలర్లు చెల్లించారని ఆమె దావాలో  పేర్కొన్నది.