హెచ్‌-1బి వీసాలో భారీ సంస్కరణలు
APEDB

హెచ్‌-1బి వీసాలో భారీ సంస్కరణలు

19-04-2017

హెచ్‌-1బి వీసాలో భారీ సంస్కరణలు

హెచ్‌-1బి వీసా విధానంలో భారీ సంస్కరణలకు ఊతమిచ్చే ‘బై అమెరికన్‌.. హైర్‌ అమెరికన్‌’ ఉత్తర్వుల జారీకి రంగం సిద్ధమైంది. ఈ ఉత్తర్వులపై సంతకం చేసేందుకు ప్రతినిధుల సభ(హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌) స్పీకర్‌ పాల్‌ రేయాన్‌ సొంత రాష్ట్రమైన విస్కాన్సిన్‌కు అధ్యక్షుడు చేరుకున్నారు. ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తే.. ఉన్నత విద్యార్హతలు, అత్యుత్తమ నైపుణ్యాలున్న వారికి, అధిక జీతాలు పొందే వారికి మాత్రమే అమెరికా వీసాలు లభిస్తాయి. విదేశాల నుంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ అమెరికాకు వచ్చే వారికి గడ్డుకాలం ప్రారంభమవుతుంది. అమెరికన్లకు ఉపాధి అవకాశాలు, అధిక వేతనాలు కల్పించాలన్న లక్ష్యంతో అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్‌-1బి వీసా నిబంధనలను కఠినంగా మార్చివేశారని ఇమ్మిగ్రేషన్‌ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.