ఘనంగా TAGC అంతర్జాతీయ మహిళా దినోత్సవం
APEDB

ఘనంగా TAGC అంతర్జాతీయ మహిళా దినోత్సవం

19-04-2017

ఘనంగా TAGC అంతర్జాతీయ మహిళా దినోత్సవం

చికాగో మహా నగర తెలుగు సంస్థ, టిఏజిసి (TAGC) 2017 మార్చి 12న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకుంది. TAGC మహిళా దినోత్సవంలో సామాన్యంగా మనసుకు చక్కగా ఆకట్టుకునే ఉత్తేజభరితమైన ఉపన్యాసాలకు, సరదాగా సాగె ఆట పాటలకు, చక్కని రుచికరమైన విందు భోజనాలకు ప్రసిద్ధి గాంచిన ఇవే కాకుండా సమాజ సేవ చేసే మహత్తర కార్యక్రమానికి నాంది అయింది. 2017 TAGC EC & TAGC -DF హైదరాబాద్ లోని డిజైర్ సొసైటీని ఈ మహిళా దినోత్సవ కార్యక్రమానికి సహాయము చేయాలని నిర్ణయించి, ప్రవేశ రుసుములో కొంత భాగం మరియు దాతల ద్వారా సేకరించిన నిధులను అందజేయాలని నిర్ణయించింది.

డిజైర్ సొసైటీ మన Hyderabadలో స్థాపించి భారత దేశం అంతటా ఎచ్ఐవి/ఎయిడ్స్ (HIV /AIDS) తో బాధ పడుతున్న అనాధ బాలబాలికలను దరిచేర్చి వారికీ సహాయ సహకారాలు అందించే ఒక స్వచ్చంద సంస్థ. ఈ సంస్థ బాధిత చిన్నారులకు దరిచేర్చి వైద్య, ఆహార, వసతి, విద్య వంటి మౌలిక సదుపాయలతో పాటు వారి మనో ధైర్యాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తుంది. TAGC మహిళా దినోత్సవంలో పాల్గొన్న మహిళలు, దాతలు టిఏజిసి (TAGC) సభ్యులు డిజైర్ సొసైటీకి అందించిన సహాయాన్ని అభినందించారు. డిజైర్ సొసైటీ చేస్తున్న సేవ ఎంతో గొప్ప సేవ అని ప్రశంసలు గుప్పించారు. టిఏజిసి (TAGC) అందించిన యాభై వేల రూపాయలు ($800 ) డిజైర్ సొసైటీకి ఎంతో కొంత ఉపయోగ పడుతుందని ధీమా వ్యక్తం చేసారు. TAGC మహిళా దినోత్సవంలో పాల్గొన్న మహిళలకు మరియు దాతలకు, టిఏజిసి (TAGC) మహిళా కార్యవర్గ సబ్యులకు, volunteersకు సంస్థ అధ్యక్షులు రామచంద్రా రెడ్డి ఏడే కృతజ్ఞతలు తెలియజేసారు.


Click here for Event Gallery