ఆ భేటీ కోసం కసరత్తులు : ట్రంప్

ఆ భేటీ కోసం కసరత్తులు : ట్రంప్

10-03-2018

ఆ భేటీ కోసం కసరత్తులు : ట్రంప్

ఉత్తర కొరియా నేత కిమ్‌ జాంగ్‌ ఉమ్‌ను కలుసుకునేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. కిమ్‌ను కలవనున్నట్లు అంగీకరించిన ట్రంప్‌ ఆ అంశంపై మరోసారి స్పందించారు. ఆ భేటీ కోసం కసరత్తులు జరుగుతున్నట్లు తెలిపారు. అయితే ఈ అంశంపై నార్త్‌ కొరియా ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. నార్త్‌ కొరియా పటిష్టమైన చర్యలు తీసుకుంటేనే ఆ భేటీ జరుగుతుందని వైట్‌హౌజ్‌ వెల్లడించింది. ఒకవేళ కిమ్‌తో భేటీపై చర్చలు ముగిస్తే అది ప్రపంచానికి మంచిదని ట్రంప్‌ పేర్కొన్నారు. కిమ్‌తో జరిగే భేటీకి సంబంధించిన సమయాన్ని, స్థలాన్ని ఇంకా నిర్ణయించాల్సి ఉందన్నారు.