అట్టహాసంగా "ఆటా" వేడుకలు
MarinaSkies
Kizen
APEDB

అట్టహాసంగా "ఆటా" వేడుకలు

11-03-2018

అట్టహాసంగా

మే 31, జూన్ 1 మరియు 2వ తేదీల్లో డల్లాస్ నగరంలో ఆటా-టాటా సంయుక్తంగా నిర్వహించనున్న మెగా కన్వెన్షలో భాగంగా అమెరికాలోని పలు నగరాల్లో "ఆటా డే" వేడుకలను అమెరికా తెలుగు సంఘం నిర్వహిస్తున్నది. అలాగే ప్రతి సంవత్సరం ఆట, అమెరికాలోని ముఖ్యమైన నగరాల్లో నిర్వహించే మరొక పెద్ద వేడుక, అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ వేడుకలను అమెరికాలోని తెలుగువారితో పాటు, భారతీయులందరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకునే అవకాశం కల్పిస్తుంది అమెరికా తెలుగు సంఘం. ఈరోజు అట్లాంటా నగరంలో ఈ కార్యక్రమానికి పరిసర ప్రాంతాలనుండి వందల మంది మహిళలు, యువతులు పాల్గొని ఆటా, పాటలతో  కార్యక్రమాన్ని ఆద్యంతం ఉర్రూతలూగించారు.

ఈ సందర్భంగా పలు రంగాల్లో మహిళలు సాధించిన విజయాలపై చర్చించుకున్నారు. అలాగే విజయాలను అందుకున్న కొంతమంది మహిళలను సన్మానించింది ఆటా. 20 సంవత్సరాల వయసులో, ఎన్నో కఠినమైన పరీక్షలను ఎదుర్కొని, వందలమందిలో ఒకరిగా నిలచి, అమెరికా వాయుసేన (US Air Force) కొరకు ఎంపికైన యశస్విని అనే 20 సంవత్సరాల యువతిని,  శ్రీమతి-ఇండియా, అట్లాంటా (Mrs-India, Atlanta) గా గెలుపొందిన శ్రీమతి హేమలత రెడ్డి గారిని మరియు గొప్ప సంగీతంలో ఎన్నో ఎత్తులను అధిరోహించిన శ్రీమతి....  గారిని అమెరికా తెలుగు సంఘం ఘనంగా సన్మానించింది. నేటి యువతరం ఇటువంటి వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని, లక్ష్య సాధనలో పాటించవలసిన మేళకువలను  యువతకు తెలియచేసేందుకు గాను, ఈ విజేతలతో కలిసి ఒక చర్చా వేదికను ఏర్పాటు చేసింది ఆటా. ఈ కార్యక్రమంలో యువత ఉత్సాహంగా పాల్గొని ఎన్నో కొత్త విషయాలను తెలుసుకోవడంలో యువత ఆనందం వ్యక్తపరచడం జరిగింది. దీనితోపాటు, సంగీత, నృత్య మరియు ఆటల కార్యక్రమాల్లో మహిళలందరూ ఉత్సాహంగా గడిపారు. ఈ కార్యక్రమాన్ని  శ్రీమతి అరుంధతి కోడూరి, శ్రీమతి శ్రావణి రాచకుల్ల, ఉదయ ఏటూరి, అనుపమ సుబ్బగారి, స్వప్న పాశం, లక్ష్మీ పెద్ది గార్లు నిర్వహణ బాధ్యతలను నిర్వహించారు. 

సాయంత్రం జరిగిన "ఆటా డే" కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తెలుగువారు వారి కుటుంబ సభ్యులతో పాటు హాజరయ్యారు. గాయని అంజనీ సౌమ్య గారు ఈ కార్యక్రమాన్ని తన పాటలతో ఉర్రూతలూగించారు. ఆమెతోపాటు గాయకులు శ్రీనివాస్ దుర్గం, రాం దూర్వాసుల, జనార్దన్ పన్నెల, హరిణి, శ్రీవల్లి శ్రీధర్ తమ తమ పాటలతో అలరించారు. 

మే 31 నుండి జూన్ 2 వరకు డల్లాస్ నగరంలో ఆటా - టాటా సంయుక్తంగా నిర్వహించనున్న మెగా కన్వెన్షన్ కొరకు ఆట విరాళాలు సేకరించింది. దీనిలో భాగంగా 2 లక్షల 50 వేల డాలర్లకు పైగా విరాళాలు అందినట్టు సంఘం అధ్యక్షులు శ్రీ  డా. కరుణాకర్ ఆసిరెడ్డి గారు తెలిపారు.  పెద్దమొత్తంలో విరాళాలు ఇచ్చిన వారిని అమెరికా తెలుగు సంఘం సత్కరించింది. ఈ కార్యక్రమానికి వచ్చి, తమవంతు సహాయం అందించిన ప్రతివారికి పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు సంఘం అధ్యక్షులు. 

ఈ కార్యక్రమానికి ఆట అధ్యక్షులు శ్రీ డా. కరుణాకర్ ఆసిరెడ్డి, శ్రీమతి ప్రశాంతి ఆసిరెడ్డి, కోశాధికారి శ్రీ కిరణ్ పాశం, శ్రీమతి స్వప్న పాశం, బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు శ్రీ అనిల్ బొద్దిరెడ్డి, శ్రీమతి రజిత బొద్దిరెడ్డి, శ్రీ వేణు పిస్కె, శ్రీమతి.... పిస్కె, రీజనల్ డైరెక్టర్ తిరుమల్ పిట్ట, మరియు శ్రీధర్ తిరుపతి, ఉమేష్, రఘురెడ్డి, నందా చాట్ల, ప్రశీల్, వెంకట్ వీరనేని, సురేష్ వొలం, ప్రశాంత్ పొద్దుటూరి, శ్రీరామ్, రమణా రెడ్డి, సుబ్బారావు మద్దలి, వెంకట్ గొట్టం, అనుపమ సుబ్బగారి, లక్ష్మీ పెద్ది, ఉదయ ఏటూరి, శ్రావణి రాచకుల్ల,  అమెరికా తెలుగుసంఘం అత్యవసర సేవల విభాగ అధ్యక్షులు శివకుమార్ రామడ్గు పాల్గొన్నారు. 

వీరితో పాటు, అమెరికాలోని పలు తెలుగు సంఘాల నాయకులు పాల్గొన్నారు. చివరగా డా.కరుణాకర్ ఆసిరెడ్డి గారు, డల్లాస్ లో జరుగనున్న మెగా కన్వెన్షన్ కి రావాల్సిందిగా అందరిని పేరు పేరున ఆహ్వానించారు.

Click here for Event Gallery