అమెరికా సైనిక ఆస్పత్రిలో కాల్పులు

అమెరికా సైనిక ఆస్పత్రిలో కాల్పులు

12-03-2018

అమెరికా సైనిక ఆస్పత్రిలో కాల్పులు

కాలిఫోర్నియా రాష్ట్రంలోని వెటరస్‌ హోం సైనిక ఆస్పత్రిలో కాల్పులు జరిగాయి. ఓ ఆగంతకుడు ఆస్పత్రిలోకి చొరబడి కాల్పులకు తెగబడ్డారు. ముగ్గురు మహిళలను తుపాకీతో కాల్చి చంపి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఆల్‌బర్ట్‌ వాంగ్‌ (36) అనే మాజీ సైనికుడు వెటరస్‌ హోం సైనిక ఆస్పత్రిలో చొరబడి బీభత్సం సృష్టించాడు. తొలుత కొందమంది మహిళలను బంధీలుగా మల్చుకుని  వదిలేశాడు. సమచారం అందుకున్న పోలీసులు, ప్రత్యేక బలగాలు ఆస్పత్రి భవనాన్ని చుట్టుముట్టాయి. వాంగ్‌కు, పోలీసులుకు మధ్య 10 నిమిసాల పాటు ఎదురుకాల్పులు జరిగినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. అనంతరం పోలీసులు ఆస్పత్రిలోకి ప్రవేశించి వాంగ్‌ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. వాంగ్‌ దాచుకున్న గదిలోకి ప్రవేశించగా నాలుగు మృతదేహాలు గర్తించారు. వాంగ్‌ కాల్పుల్లో  సైనిక ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ క్రిస్టన్‌ లోబర్‌(48), క్లినికల్‌ డైరెక్టర్‌ జెన్నిఫర్‌ గోలిక్‌, సైకాలజిస్ట్‌ గోంజేల్స్‌ (29) మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఆస్పత్రి సిబ్బందిపై కాల్పులకు పాల్పడం అనంతరం వాంగ్‌ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసు అధికారులు తెలిపారు.