అమెరికాను వణికిస్తున్న ఐపీఎఫ్

అమెరికాను వణికిస్తున్న ఐపీఎఫ్

12-03-2018

అమెరికాను వణికిస్తున్న ఐపీఎఫ్

అంతుచిక్కని వ్యాధి ఇప్పుడు అమెరికన్లను హడలెత్తిస్తోంది. ఇడియోపతిక్‌ పల్మనరీ ఫైబ్రోసిస్‌ (ఐపీఎఫ్‌)గా పేర్కొనే ఈ జబ్బు ఊపిరితిత్తులు చెడిపోయేలా చేసి ప్రాణాతకంగా పరిణమిస్తుంది. ఇప్పటికే అమెరికా మొత్తంలో 984 మంది ఈ వ్యాధి బారిన పడినట్లు అధికారిక సమచారం. అందులో తొమ్మిది మంది దంత వైద్యులు కావడం గమనార్హం. ఆ తొమ్మిది మందిలో కేవలం ఇద్దరే బతికారు. ఈ తొమ్మిది మంది వైద్యులు వర్జీనియా రాష్ట్రంలోని ఓ డెంటల్‌ క్లీనిక్‌కు చెందినవారే. దాంతో సీడీసీ (సెంటర్‌ ఫర్‌ డిసీస్‌ కంట్రోల్‌) బోర్డు ఈ వ్యాధిపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. అమెరికాలోని ఇతర జనాభాతో పోలిస్తే 23 రెట్లు ఎక్కువగా దంత వైద్యులే ఈ వ్యాధి బారిన పడుతున్నారని సీడీసీ తెలిపింది. వైద్యులు పనిచేస్తున్న వాతావరణంలోనే ఉండే క్రిములే ఈ వ్యాదికి కారణమని పలువురు వైద్య నిపుణులు చెబుతున్నారు. వర్జీనియా రాష్ట్రంలో ఉన్న డెంటల్‌ క్లీనిక్‌లో గత 21 ఏళ్లలో 900 మంది వైద్యులు ఈ ఐపీఎఫ్‌ వ్యాధి బారిన పడ్డారని తేలింది. అమెరికాలో దాదాపు 650,000 మంది దంత వైద్యులు ఉన్నారు. ముదురుతున్న ఐపీఎఫ్‌ కేవలం కేసుల నేపథ్యంలో డెంటల్‌ క్లీనిక్‌లో పనిచేసేవారందరూ మాస్క్‌లు ధరించాలని సీడీసీ హెచ్చరించింది.