లియో టాల్ స్టాయ్ లేఖకు వేలంలో రూ.13.94 లక్షలు

లియో టాల్ స్టాయ్ లేఖకు వేలంలో రూ.13.94 లక్షలు

13-03-2018

లియో టాల్ స్టాయ్ లేఖకు వేలంలో రూ.13.94 లక్షలు

ప్రఖ్యాత రష్యా రచయిత లియో టాల్‌స్టాయ్‌ రాసిన అరుదైన లేఖ వేలంలో రూ.13.94 లక్షలు (21,450 డాలర్లు) పలికింది. దీనిపై టాల్‌ స్టాయ్‌ సంతకముంది. తాత్వికవేత్త ప్యాట్ర్‌ పెట్రోవిచ్‌ నికోలేవ్‌కు 1903లో దీన్ని ఆయన రాశారు. ఏసుక్రీస్తు బోధనలను వక్రీకరించడం గురించి దీనిలో ప్రస్తావించారు. మూడు పేజీల నిడివున్న ఈ లేఖ రూ.9.75 లక్షలు పలుకుతుందని భావించినట్లు అమెరికాకు చెందిన వేలం సంస్థ ఆర్‌ఆర్‌ ఆక్షన్స్‌ తెలిపింది. పెట్రోవిచ్‌ లేఖకు స్పందనగా టాల్‌స్టాయ్‌ స్వయంగా ఈ లేఖ రాసినట్లు పేర్కొంది.