సింగపూర్ డీల్ ను నిషేధించిన ట్రంప్
Sailaja Reddy Alluddu

సింగపూర్ డీల్ ను నిషేధించిన ట్రంప్

13-03-2018

సింగపూర్ డీల్ ను నిషేధించిన ట్రంప్

సింగపూర్‌కు చెందిన బ్రాడ్‌కామ్‌ అనే సంస్థ 177 బిలియన్‌ డాలర్లు విలువచేసే అమెరికాకు చెందిన క్వాల్‌కామ్‌ అనే చిప్స్‌ సంస్థను టేకోవర్‌ చేసుకునే ఓ పెద్ద వ్యాపార లావాదేవీని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నిలిపివేశారు. అందుకు ఆయన జాతీయ భద్రతా కారణమేనంటూ సాకు చూపారు. ప్రతిపాదిత ఆ టేకోవర్‌ను తక్షణం శాశ్వతంగా రద్దు చేసుకోలేమని ఆదేశించారు. ఏ రూపంలోనైన ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మరే రూపంలోనైనా కొనుగోలుదారుడు క్వాల్‌కామ్‌ తీసుకోవడాన్ని నిషేధించామంటూ ఉత్తర్వులు జారీ చేశారు. అమెరికా అధ్యక్షుని ఉత్తర్వులు సమీక్షిస్తున్నామని బ్రాడ్‌కామ్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.