అమెరికా దేశపు పౌరసత్వం పొందడం ఎలా?

అమెరికా దేశపు పౌరసత్వం పొందడం ఎలా?

13-03-2018

అమెరికా దేశపు పౌరసత్వం పొందడం ఎలా?

 • అమెరికా దేశంలో ఉన్న వనరులు, అవకాశాలను దృష్టిలో పెట్టుకొని ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఏదో విధంగా అమెరికా చేరుకొని  అమెరికా దేశపు పౌరసత్వాన్ని పొంది స్థిర నివాసం ఏర్పరుచుకోవాలనే కలలు కంటూ ఉంటారు. అయితే కొద్ది మంది మాత్రమే ఈ కలలను  సాకారం చేసుకోగల్గుతారు.
 • 2016 సంవత్సరంలో దాదాపుగా పది లక్షల మంది అమెరికా పౌరసత్వానికై దరఖాస్తు చేసుకోగా ఏడు లక్షల యాభై రెండు వేల ఎనిమిది వందల మందికి అమెరికా దేశ పౌరసత్వం లభించింది.
 • అమెరికా ప్రభుత్వపు నివేదిక ప్రకారం 2016 లో లక్షా మూడు వేల ఇదు వందల యాభై (1,03,550) మంది మెక్సికన్ దేశస్తులు, 46,100 మంది ప్రవాస భారతీయులు, 41, 285 మంది ఫిలిప్పీన్స్ దేశస్తులు అమెరికా పౌరసత్వాన్ని పొందగల్గారు.
 • అమెరికా దేశపు పౌరసత్వాన్ని మూడు రకాలుగా పొందే అవకాశం ఉంది:
 1. అమెరికా దేశంలో జన్మించడం ద్వారా
 2. వారసత్వపు హక్కు ద్వారా
 3. తగిన అర్హతలు సంపాదించడం ద్వారా 
 1. అమెరికా దేశంలో జన్మించడం ద్వారా:
 • అమెరికా దేశంలో ఉన్న ఏ 50 రాష్ట్రాల్లో జన్మించినా లేదా అమెరికా అధీనంలో ఉన్న పోర్టోరీకో, గ్వామ్, యూ.ఎస్. వర్జిన్ ఐలాండ్స్, మరియు నార్తర్న్ మరయానా ఐలాండ్స్ లో  1986 తరువాత జన్మిస్తే. 
 1. అమెరికా దేశం వెలుపల జన్మించిన పిల్లలకు వారసత్వపు హక్కు ద్వారా:
 2. అమెరికా పౌరులైన దంపతులకు (కనీసం ఒకరు అమెరికాలో గతంలో గాని ప్రస్తుతం గాని నివాసం ఉండి ఉండాలి) జన్మించిన పిల్లలకు అమెరికా పౌరసత్వం లభిస్తుంది.
 3. దంపతులలో ఒకరికి మాత్రమే అమెరికా దేశపు పౌరసత్వం ఉంటే - ఆ పౌరసత్వం ఉన్న వారు పిల్లలు పుట్టే సమయానికి కనీసం 5 సంవత్సరాలు అమెరికాలో నివసించి ఉండి ఉండాలి. అమెరికా దేశపు పౌరసత్వం ఉన్న వారు ఈ 5 సంవత్సరాల అమెరికా నివాసంలో, 14 సంవత్సరాల వయస్సు దాటిన తరువాత కనీసం 2 సంవత్సరాలు అమెరికాలో ఉండి ఉండాలి. అప్పుడు వారికి పుట్టిన పిల్లలకు కూడా పౌరసత్వం లభిస్తుంది.    
  1. ప్రత్యేక పరిస్థితులు: ఈ క్రింది పరిస్థితులలో పైన పేర్కొన్న 5 సంవత్సరాల కాల పరిమితి వర్తించదు:
   1. ఇతర దేశాల్లో ఉండి అమెరికా సైనిక అధికారిగా పనిచేస్తున్నప్పుడు
   2. ఇతర దేశాల్లో అమెరికా ప్రభుత్వపు అధికారిగా పనిచేస్తున్నప్పుడు
 • ఇతర దేశాల్లో కొన్ని అంతర్జాతీయ సంస్థల ద్వారా పనిచేస్తున్నప్పుడు 
 • పెళ్లి కాకుండా సహజీవనం ద్వారా పిల్లలు కలిగినప్పుడు –
 • తల్లి అమెరికా దేశపు పౌరురాలై ఉండి తండ్రి కాకపోతే – తల్లి తనకు పిల్లలు పుట్టే సమయానికి ఒక సంవత్సరం ముందు అమెరికా దేశంలో నివసించి లేదా నివసిస్తూ ఉండి ఉండాలి
 • తండ్రి అమెరికా పౌరుడై ఉండి తల్లి కాకపోతే – తండ్రి రాతపూర్వకంగా ఆ పుట్టిన శిశువుకు
  • తానే తండ్రినని
  • ఆ శిశువు 18 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు అవసరమైన ఆర్ధిక సహాయం అందిస్తానని
  • ఆ శిశువు జననానికి ముందు తండ్రి కనీసం 5 సంవత్సరాలు అమెరికాలో నివసించి ఉండాలి. ఈ 5 సంవత్సరాల అమెరికా నివాసంలో, 14 సంవత్సరాల వయస్సు దాటిన తరువాత కనీసం 2 సంవత్సరాలు అమెరికాలో ఉండి ఉండాలి. 
 1. తగిన అర్హతలు సంపాదించడం ద్వారా: (N-600)
 • కనీసం 5 సంవత్సరాలు పాటు గ్రీన్ కార్డు కలిగి ఉండాలి మరియు
  • 18 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి
  • పౌరసత్వానికై దరఖాస్తు చేసేనాటికీ  కనీసం ౩ నెలలు ముందుకాలం అమెరికాలో ఉండి ఉండాలి.
  • పౌరసత్వానికై దరఖాస్తు చేసేనాటికీ  ఈ 5 సంవత్సరాల కాలంలో కనీసం 30 నెలలు అమెరికాలో ఉండి ఉండాలి
  • దరఖాస్తు చేసిన నాటి నుండి పౌరసత్వం పొందే వరకు అమెరికా దేశంలో నివసిస్తూ ఉండాలి. ( కాని సెలవులపై విదేశీ ప్రయాణాలు చేయవచ్చు)
  • అమెరికా దేశపు చరిత్ర, ప్రభుత్వ పరిపాలనా విధానం తెలిసి ఉండి ఆంగ్ల భాష చదవడం, రాయడం, మాట్లాడటం కొంత వరకైనా వచ్చి ఉండాలి.
  • అమెరికా రాజ్యాంగాన్ని, చట్టాలను గౌరవిస్తూ, భాధ్యతాయుతమైన వ్యక్తిగా మెలిగి ఉండాలి.
 • అమెరికా పౌరసత్వం ఉన్న వారితో వివాహం జరిగితే –
  • కనీసం 3 సంవత్సరాలు పాటు గ్రీన్ కార్డు కలిగి ఉండాలి
  • 18 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి
  • పౌరసత్వానికై దరఖాస్తు చేసేనాటికీ  కనీసం ౩ నెలల ముందుకాలం అమెరికాలో ఉండి ఉండాలి.
  • ఆ ౩ సంవత్సరాల కాలం పూర్తయి పౌరసత్వం కోసం దరఖాస్తు చేసి పౌరసత్వం పొందే వరకు వైవాహిక బంధంలోనే ఉండి ఉండాలి.
  • పౌరసత్వానికై దరఖాస్తు చేసేనాటికీ  ఈ 3 సంవత్సరాల కాలంలో కనీసం 18 నెలలు అమెరికాలో ఉండి ఉండాలి
  • దరఖాస్తు చేసిన నాటి నుండి పౌరసత్వం పొందే వరకు అమెరికా దేశంలో నివసిస్తూ ఉండాలి. ( కాని సెలవులపై విదేశీ ప్రయాణాలు చేయవచ్చు)
  • అమెరికా దేశపు చరిత్ర, ప్రభుత్వ పరిపాలనా విధానం తెలిసి ఉండి ఆంగ్ల భాష చదవడం, రాయడం, మాట్లాడటం కొంతవరకైనా వచ్చి ఉండాలి.
  • అమెరికా రాజ్యాంగాన్ని, చట్టాలను గౌరవిస్తూ, భాధ్యతాయుతమైన వ్యక్తిగా మెలిగి ఉండాలి. 

గ్రీన్ కార్డు పొందడానికి కావలసిన అర్హతలు: ( I-485)

ఈ క్రింది పేర్కొన్న విధంగా గ్రీన్ కార్డు పొందవచ్చు –

 1. కుటుంబ బంధం ద్వారా
 2. ఉద్యోగం ద్వారా
 3. పెట్టుబడి పెట్టడం ద్వారా
 4. ప్రత్యేక పరిస్థితులలో
 5. శరణార్ధులు లేదా కాందిశీకులు
 6. లాటరీ సిస్టం ద్వారా
 7. పేర్లు నమోదు చేసుకోవడం ద్వారా 
 1. కుటుంబ బంధం ద్వారా గ్రీన్ కార్డు :
 • అమెరికా పౌరసత్వం లేదా గ్రీన్ కార్డు ఉన్నవారితో వివాహం జరిగితే
 • మీ తల్లిదండ్రులు అమెరికా పౌరులు లేదా గ్రీన్ కార్డు ఉన్నవారు అయితే ( ఒకవేళ తల్లిదండ్రులు గ్రీన్ కార్డు ఉన్న వారు అయితే, వారి పిల్లలు అవివాహితులుగా ఉన్నప్పుడు మాత్రమే అర్హులు)
 • కనీసం 21 సంవత్సరాల వయస్సు ఉన్న మీ సోదరుడు లేదా సోదరి అమెరికా దేశపు పౌరులై ఉంటే
 • అమెరికా పౌరసత్వం ఉన్నవారితో పెళ్లి నిశ్చయమైతే
 • మీ తల్లి లేదా తండ్రికి అమెరికా పౌరసత్వం కలిగిన వారితో వివాహం నిశ్చయమైనప్పుడు, మీరు కూడా గ్రీన్ కార్డు కు అర్హులే.
 1. ఉద్యోగం ద్వారా గ్రీన్ కార్డు
 • వివిధ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు వారి యాజమాన్యం ద్వారా గ్రీన్ కార్డు కై దరఖాస్తు చేసుకోవచ్చు. 
 1. అమెరికాలో పెట్టుబడులు పెట్టడం ద్వారా గ్రీన్ కార్డు
 • అమెరికాలో కనీసం 5 లక్షల డాలర్లు పెట్టుబడి పెట్టి కనీసం 5 ఉద్యోగాలను కల్పించడం ద్వారా లేదా 1 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టి కనీసం 10 ఉద్యోగాలను కల్పించడం ద్వారా
 1. ప్రత్యేక పరిస్థితుల్లో గ్రీన్ కార్డు:
 • అమెరికా దేశంలోని లాభాపేక్ష రహిత, మతపరమైన సంస్థల్లో పని చేయడం ద్వారా
 • విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసిన వారు
 • గ్రీన్ కార్డు కల్గి ఉండి అమెరికా దేశానికి వెలుపల ఒక సంవత్సరం పైగా గడిపిన వారు
 • అంతర్జాతీయ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు
 • అమెరికా దేశపు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇతర దేశం నుంచి వచ్చి వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు  
 1. శరణార్ధులు లేదా కాందిశీకులకు గ్రీన్ కార్డు
 • అమెరికా ప్రభుత్వం నుంచి శరణార్ధులు లేదా కాందిశీకులుగా గుర్తింపు పొందిన ఒక సంవత్సర కాలం తరువాత వారు గ్రీన్ కార్డు కై దరఖాస్తు చేసుకోవచ్చు. 
 1. లాటరీ పద్ధతి ద్వారా గ్రీన్ కార్డు
 • కనీసం హైస్కూల్ స్థాయి విద్యార్హత కల్గి ఉండాలి లేదా గడిచిన 5 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాలు ఏదైనా ఉద్యోగం చేసి ఉండాలి.
 • సాధారణంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో కంప్యూటర్ లాటరీ పధ్ధతి ద్వారా 55,000 వరకు గ్రీన్ కార్డులను జారీ చేస్తారు.
 1. పేర్లు నమోదు చేసుకోవడం ద్వారా గ్రీన్ కార్డు
 • జనవరి 01, 1972 కి ముందు అమెరికాలో ప్రవేశించి, అమెరికా పౌరసత్వం పొందడానికి అర్హులైతే ప్రత్యేకంగా నమోదు చేసుకోవడం ద్వారా గ్రీన్ కార్డు పొందవచ్చు.

పూర్తి వివరాలకు www.prasadthotakura.com ను చూడండి

(ఈ వ్యాస రచయిత డాక్టర్. ప్రసాద్ తోటకూర గత మూడు దశాబ్దాలుగా అమెరికాలో స్థిరపడి పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న ప్రముఖ ప్రవాస భారతీయ నాయకుడు.)