అమెరికా వేలంలో 700 డాలర్లకు అమ్ముడు పోయిన 'కింగ్‌ ఆఫ్‌ డార్క్‌ చాంబర్‌'
Sailaja Reddy Alluddu

అమెరికా వేలంలో 700 డాలర్లకు అమ్ముడు పోయిన 'కింగ్‌ ఆఫ్‌ డార్క్‌ చాంబర్‌'

14-03-2018

అమెరికా వేలంలో 700 డాలర్లకు అమ్ముడు పోయిన 'కింగ్‌ ఆఫ్‌ డార్క్‌ చాంబర్‌'

నోబెల్‌ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ సంతకం చేసిన ఆంగ్ల గ్రంథం ది కింగ్‌ ఆఫ్‌ డార్క్‌ చాంబర్‌ అమెరికాలో జరిపిన వేలంలో 700 డాలర్లకు అమ్ముడు పోయింది. ఆయన బెంగాలీలో రాసిన రాజా కు ఇది ఆంగ్ల అనువాదం. 1961లో మాక్మిలన్‌ కంపెనీ ముద్రించిన బోల్‌పూర్‌ ఎడిషన్‌ మొదటి పేజీలో పౌంటెన్‌ పెన్‌తో ఠాగూర్‌ సంతకం చేశారు. దయగల, సమర్థుడైన రాజుకు సంబంధించిన ఈ నాటకం ఒక రహస్యమైన, కనిపించని, సర్వజ్ఞుడైన రాజు చుట్టు తిరుగుతుంది. అందమైన ఆయన భార్య, సమీపంలోని రాజ్యాల రాజులకు సంబంధించి ఆయన అయిష్టతకు కారణాలను ఎక్కువగా వివరిస్తుంది. ఆన్‌లైన్‌లో బుక్‌ 500 డాలర్లకు అమ్ముడు పోవచ్చని మొదట భావించారు. అన్ని సాహిత్య ప్రక్రియలలో ఆయన 50కి పైగా సంపుటాలను వెలువరించారు. 1913లో ఠాగూర్‌ నోబెల్‌ బహుమతికి ఎంపికయ్యారు.