కిమ్ తో భేటీకి ట్రంప్ షరతులు

కిమ్ తో భేటీకి ట్రంప్ షరతులు

14-03-2018

కిమ్ తో భేటీకి ట్రంప్ షరతులు

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌తో భేటీ అయ్యేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అంగీకరించారని వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ సాండర్స్‌ తెలిపారు. అయితే, ఈ భేటీలో ట్రంప్‌ పాల్గొనాలంటే ఉత్తరకొరియా పలు షరతులకు తలొగ్గాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. ఉత్తర కొరియా తన అణ్వస్త్ర పరీక్షలు, క్షిపణుల తయారీని నిలిపివేయాలని కోరారు. గతవారం జాతీయ భద్రతా సలహాదారు దక్షిణ కొరియా ప్రతినిధి బృందం ట్రంప్‌ను, కిమ్‌ని సమావేశానికి ఆహ్వానించినట్లు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ సమావేశం కోసం తామెంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని అన్నారు. ఈ సమావేశాలను అనేక స్థాయిలలో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు.