హిల్లరీ చేతికి గాయం

హిల్లరీ చేతికి గాయం

14-03-2018

హిల్లరీ చేతికి గాయం

బారత పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి హిల్లరీ క్లింటన్‌ చేతికి స్వల్ప గాయమైంది. ప్రస్తుతం హిల్లరీ రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లో పర్యటిస్తుండగా ఆమె చేయి బెణికింది. మధ్యప్రదేశ్‌ నుంచి రెండు రోజుల యాత్ర కోసం ఆమె మంగళవారం ఉదయమే  జోధ్‌పూర్‌కు చేరుకున్నారు. సాయంత్రం మెహ్రంగఢ్‌ కోటను సందర్శించాల్సి ఉండగా చేయి బెణకడంతో అది రద్దయింది. జోధ్‌పూర్‌లోని ఉమైద్‌ భవన్‌ ప్యాలెస్‌లో ఆమె ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమైతే సలవాస్‌ గ్రామంలోని తివాచీలు తయారుచేసే కేంద్రాలను హిల్లరీ సందర్శించి అక్కడి నేత కార్మికులతో ఆమె మాట్లాడాల్సి ఉంది. అయితే చేతికి గాయం కారణంగా ఆమె అక్కడికి వెళ్లడం కూడా అనుమానమేనని అధికారులు తెలిపారు.