విదేశాంగ మంత్రికి షాకిచ్చిన ట్రంప్

విదేశాంగ మంత్రికి షాకిచ్చిన ట్రంప్

14-03-2018

విదేశాంగ మంత్రికి షాకిచ్చిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నారు. విదేశాంగ శాఖ మంత్రి రెక్స్‌ టిలర్సన్‌ను ఆ పదవి నుంచి తొలగించారు. ఉత్తర కొరియాతో కీలకమైన చర్చలకు ముందు ట్రంప్‌ తీసుకున్న ఈ నిర్ణయం సంచలనం సృష్టిస్తోంది. కొంత కాలంగా టిలర్సన్‌, ట్రంప్‌ మధ్య ఏర్పడ్డ విభేదాలే ఇందుకు కారణమని తెలుస్తోంది. కొత్త విదేశాంగ మంత్రిగా అమెరికా నిఘా సంస్థ (సీఐఏ) డైరెక్టర్‌ మైక్‌ పాంపియోను నియమిస్తున్నట్లు ట్రంప్‌ తెలిపారు. పాంపియో ఈ పదవికి అత్యంత సమర్ధుడనేది నా నమ్మకం. కొరియాలో నిరాయుధీకరణ, ప్రతికూల పరిస్థితులను సరి చేయడంలో పాంపియో తనదైన శైలిలో పనిచేస్తారని భావిస్తున్నాను అంటూ ట్వీట్‌ చేశారు. సీఐఏ చీఫ్‌గా ఒక మహిళను నియమించడం ఇదే తొలిసారి.