సొమ్ము వెనక్కిచేస్తా... నాడేం జరిగిందో చెప్పేస్తా

సొమ్ము వెనక్కిచేస్తా... నాడేం జరిగిందో చెప్పేస్తా

14-03-2018

సొమ్ము వెనక్కిచేస్తా... నాడేం జరిగిందో చెప్పేస్తా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రాసలీల బాగోతం మరో కీలకమలుపు తిరిగింది. 2006లో ట్రంప్‌తో సంబంధం పెట్టుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శృంగార తార స్టెఫానీ క్లిఫోర్డ్‌ అలియాస్‌ స్టార్మీ డేనియల్స్‌ ఓ బాంబు పేల్చింది. ట్రంప్‌తో బంధాన్ని బయటపెట్టకుండా ఉండేందుకు తనకు చెల్లించిన రూ.87 లక్షల మొత్తం (1,30,000 డాలర్లు) తిరిగి ఆయనకే ఇచ్చేస్తానని ప్రకటించింది. ఆ లైంగిక సంబంధం వివరాలను ఎన్నటికీ బయటపెట్టకుండా ఉండేందుకు ఒప్పందం కుదుర్చుకుని ఈ మొత్తాన్ని ట్రంప్‌ తరపున ఆయన న్యాయవాది కోహెన్‌ 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో చెల్లించారు. అయితే మీడియా కథనాలతో ఇది రచ్చ రచ్చ అయిపోయింది. దీంతో స్టార్మీ ఆ డబ్బు వెనక్కి ఇచ్చేసి పన్నెండేళ్ల కిందట ఏం జరిగిందో బయటపెట్టాలని నిర్ణయించుకుంది. దీని వల్ల ట్రంప్‌ మరింతగా ఇరుక్కోనున్నారు.