స్టీఫెన్ హాకింగ్ ఇక లేరు

స్టీఫెన్ హాకింగ్ ఇక లేరు

14-03-2018

స్టీఫెన్ హాకింగ్ ఇక లేరు

ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌(76) కన్నుమూశారు. బుధవారం ఉదయం ఆయన కేంబ్రిడ్జ్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు స్టీఫెన్‌ కుటుంబ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఖమా నాన్న ఈ రోజు మమ్మల్ని విడిచి వెళ్లిపోయారు. ఇది అత్యంత బాధాకరం అని స్టీఫెన్‌ పిల్లలు లూసీ, రాబర్ట్‌, టిమ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. స్టీఫెన్‌ పూర్తి పేరు స్టీఫెన్‌ విలియమ్‌ హాకింగ్‌. 1942 జనవరి 8న ఇంగ్లాండ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌షైర్‌ కౌంటీలో జన్మించారు. కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ నుంచి విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన స్టీఫెన్‌, భౌతికశాస్త్రంలో అనేక పరిశోధనలు చేశారు. సాపేక్ష సిద్ధాంతం, గురుత్వాకర్షణ ఏకతత్వ సిద్ధాంతాలపై అధ్యయనాలు చేశారు. కృష్ణబిలాలు కూడా రేడియేషన్‌కు ఉత్పత్తి చేస్తాయని ధ్రువీకరించారు. దీన్నే హాకింగ్‌ రేడియేషన్‌ అని కూడా పిలుస్తారు.