Telangana Tourism
Karur Vysya Bank
Manjeera Monarch

ఫోర్బ్స్‌ జాబితాలో తెలుగు కుర్రాడు

19-04-2017

ఫోర్బ్స్‌ జాబితాలో తెలుగు కుర్రాడు

ప్రతిష్ఠాత్మక ఫోర్బ్స్‌ 30 అండర్‌ 30 ఏషియా జాబితాలో హైదరాబాద్‌కు చెందిన రోహిత్‌ పోతుకూచి చోటు దక్కించుకున్నారు. స్టాండర్డ్‌ ఇండియన్‌  లీగల్‌ సైటేషన్‌ (ఎస్‌ఐఎల్‌సీ) ను రోహిత్‌ స్థాపించారు. న్యాయ విద్యకు సంబంధించి ఆయన రాసిన డాక్యుమెంటేషన్‌, రీసెర్చ్‌ను హార్వ్‌ర్డ్‌ లా స్కూల్‌ గుర్తించింది. అంతే కాదు దాన్ని దేశ వ్యాప్తంగా 300 కు పైగా లా స్కూళ్లలో ఉపయోగిస్తుండటం గమనార్హం. రోహిత్‌ 2013లో హైదరాబాద్‌ నల్సార్‌ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించారు.