కొలంబస్‌ లో ఘనంగా ఆటా మహిళా దినోత్సవం
APEDB

కొలంబస్‌ లో ఘనంగా ఆటా మహిళా దినోత్సవం

19-04-2017

కొలంబస్‌ లో ఘనంగా ఆటా మహిళా దినోత్సవం

అమెరికా తెలుగు అసోసియేషన్‌ (ఆటా) ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒహాయోలోని కొలంబస్‌ లో ఘనంగా నిర్వహించారు. పెర్సిస్‌ రెస్టారెంట్‌ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి 130 మందికి పైగా మహిళలు హాజరయ్యారు. నృత్యాలు, పాటలతో పాటూ ముఖ్యంగా యువతుల ఫ్యాషన్‌ షో వీక్షకులను ఆకట్టుకుంది.

ప్రణీతారెడ్డి ఆటల పోటీలను నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. ఆటా సభ్యులైన సుధా రెడ్డి అతిథులను సాదరంగా ఆహ్వానించారు. చందు రెడ్డి, అమర్‌ రెడ్డి కార్యక్రమం రూపకల్పన చేయగా స్వాతి రెడ్డి కార్యక్రమం విజయవంతం చేయడంతో తమ వంతు కృషి చేశారు.


Click here for Event Gallery