సిలికానాంధ్ర ఉగాది వేడుకలు

సిలికానాంధ్ర ఉగాది వేడుకలు

27-03-2018

సిలికానాంధ్ర ఉగాది వేడుకలు

సిలికానాంద్ర ఆధ్వర్యంలో విళంబినామ సంవత్సర ఉగాది వేడుకలను యూనివర్సిటీ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ప్రముఖ అవధాన పండితుడు పాలపర్తి శ్యామలానంద ప్రసాద్‌ అధ్యక్షతన జరిగిన అవధానం తెలుగు భాషాభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. కిరణ్‌ ప్రభ ఈ అవధానానికి సంధాన కర్తగా వ్యవహరించారు. బేఏరియాలో ప్రముఖ వేద పండితుడు మారేపల్లి వెంకట శాస్త్రీ పంచాంగ శ్రవణం చేసారు. ఆహుతులకు ఉగాది పచ్చడిని అందించడంతో పాటు మంచి విందు భోజనాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేసారు. సిలికానాంధ్ర వ్యవస్థాపకుడు కూచిభొట్ల ఆనంద్‌ తో పాటు పలువురు సిలికానాంధ్ర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.