మౌంటెన్ హౌస్ ట్రేసీ ఉగాది సంబరాలు

మౌంటెన్ హౌస్ ట్రేసీ ఉగాది సంబరాలు

27-03-2018

మౌంటెన్ హౌస్ ట్రేసీ ఉగాది సంబరాలు

మౌంటెన్‌ హౌస్‌ ట్రేసీ తెలుగు సంఘం(ఎంటీటీఏ) ఆధ్వర్యంలో ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు. మౌంటెన్‌ హౌస్‌లోని బెతానీ స్కూల్‌ మల్టీపర్పస్‌ రూమ్‌లో జరిగిన ఉత్సవాలకు మౌంటెన్‌ హౌస్‌, ట్రేసీలోని తెలుగువారు సంప్రదాయ దుస్తులు ధరించి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఉమా మహేశ్వరి ఏలూరి, ఫణి కాసిబొట్ల వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ సాంస్క తిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. శివపార్వతి అనంతు దర్శకత్వంలో సుమారు 30 మంది చిన్నారులతో అష్టలక్ష్మీ వైభవం నాటక ప్రదర్శన కార్యక్రమాల్లో హైలైట్‌గా నిలిచింది. ఉగాది, శ్రీరామ నవమి కలిసి రావడంతో కార్యక్రమానికి హాజరైన అతిధులకు ఉగాది పచ్చడి, పానకంతో పాటు రకరకాల వంటలతో విందు భోజనం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి హాజరైన వారందరికి ఎంటీటీఏ కార్యనిర్వాహక సంఘం ఉగాది శుభాకాంక్షలు తెలిపింది.