క్యాట్స్ ఉగాది వేడుకలు

క్యాట్స్ ఉగాది వేడుకలు

28-03-2018

క్యాట్స్ ఉగాది వేడుకలు

క్యాపిటల్‌ ఏరియా తెలుగు సొసైటీ ఆధ్వర్యంలో మార్చి 31న ఉగాది వేడుకలను వైభవంగా జరపనున్నారు. 31వ తేదీ శనివారం సాయంత్రం 4:30 నుండి బ్రాడ్‌ రన్‌ ఉన్నత పాఠశాలలో జరగబోయే ఈ విళంబి నామ ఉగాది సంబరాలకు అందరినీ కాట్స్‌ సంస్థ ఆహ్వానిస్తోంది. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. విభిన్న రంగాల్లో రాణిస్తున్న మహిళలకు సత్కారం, షార్ట్‌ ఫిలిం, టేబుల్‌ టెన్నిస్‌ మరియు చెస్‌ పోటీలు, చర్చా వేదిక, ఫాషన్‌ షో, ఆటలు, పాటలు, తెలుగు సినీ గాయనీగాయకుల సంగీత కచేరి వంటివి ఈ కార్యక్రమాల్లో ఉన్నాయి.