యోగాసనాలతో యూఎస్‌ పోస్టల్‌ స్టాంప్‌
Nela Ticket
Chal Mohan Ranga
Kizen
APEDB

యోగాసనాలతో యూఎస్‌ పోస్టల్‌ స్టాంప్‌

19-04-2017

యోగాసనాలతో యూఎస్‌ పోస్టల్‌ స్టాంప్‌

యోగాసనాలతో పోస్టల్‌ స్టాంప్‌ను విడుదల చేయనుంది యునైటెడ్‌ నేషన్స్‌.  జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పది యోగాసనాలతో తయారు చేసిన పోస్టల్‌ స్టాంప్‌ను ఐక్యరాజ్యసమితి పోస్టల్‌ శాఖ విడుదల చేయనుంది. స్టాంప్‌పై పది ఆసనాలను ముద్రించారు. ఆసనాలతో పాటు ఓమ్‌ అక్షరాలు కూడా ఉంటాయి. అయితే స్టాంపులన్నీ సింగిల్‌ షీట్‌లో ఉంటాయి. దానిపై యూఎస్‌ బిల్డింగ్‌తో పాటు యోగా డే ముద్ర కూడా ఉంటుంది. యూఎస్‌ ప్రతినిధి సయ్యిద్‌ అక్బరుద్దిన్‌ ఈ స్టాంప్‌కు సంబంధించిన ట్వీట్‌ చేశారు. సింగర్‌ సుబ్బలక్ష్మి సంస్మరణార్థం కూడా 2016లో యూఎస్‌ ఓ పోస్టల్‌ స్టాంప్‌ను రిలీజ్‌ చేసింది. అమెరికా డాలర్‌ డినామినేషన్‌తో స్టాంప్‌లను న్యూయార్క్‌లో రిలీజ్‌ చేస్తారు.